నొప్పించక తానొవ్వక అన్న ధోరణిలోనే మాట్లాడడం లో చాలా నేర్పు ఉంది. నాగ్ కు ఆ నేర్పు తెలుసు.కనుక ఆయనేం మాట్లాడినా ఇప్పుడు తప్పించుకుని రేపు సినిమా రిలీజ్ ను సాఫీగా సాగించి ఒడ్డెక్కేందుకు చేస్తున్న లేదా చేసిన ప్రయత్నం అంతా ఇవాళ మీడియా మీట్ లో స్పష్టం అయింది.రేపటి వేళ ఇదే ఆయన సినిమా సక్సెస్ కు కారణం కావొచ్చు.లేదా మరో రూపంలో సినిమాకు ఓ సానుకూల ఫలితం కావొచ్చు.అందుకే నిన్నమొన్నటి వేళ హీరో నానీ విషయంలో జరిగిన తగాదాల నేపథ్యంలో చాలా జాగ్రత్త పడ్డాడు.
సినిమా స్టేజ్ మీద పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడకూడదు..నేను మాట్లాడను..అని చెప్పాడు నాగ్.. బంగార్రాజు సినిమాకు సంబంధించి మీడియా మీట్ ను ఇవాళ నిర్వహించారు.ఈ సందర్భంగా నాగార్జున కీలకమైన వ్యాఖ్యలు చేసి తప్పించుకున్నారు కూడా! ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం మాట్లాడినా తలనొప్పే అన్న ఉద్దేశంతో నాగార్జున ఈ పాటి జాగ్రత్తలు తీసుకున్నారని భావించి, ప్రస్తుతానికి చర్చను ముగించేయడమే తప్ప చేయగలిగిందేమీ లేదు.ఈ నేపథ్యంలో సినిమా బాగా వచ్చిందన్ననమ్మకం తప్ప తనకు మరేమీ గుర్తుకు రావడం లేదని కూడా చెబుతూ ఎన్నడూ లేనిది డెస్టినీని నమ్ముకుని తాను ప్రేక్షకుల ముందుకువస్తున్నానని అన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి