తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, హిందీ భాషల్లోనూ నటించిన శోభన.. మరోవైపు దేశవ్యాప్తంగా ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఫుల్ పాపులరిటీ సంపాదించుకుంది. ఇకపోతే శోభన వయసు 51 ఏళ్లు. అయితే ఇప్పటికీ ఈమె పెళ్లి మాత్రం చేసుకోలేదు. అందుకు కారణం ఏంటీ..? అసలు శోభన ఎందుకు పెళ్లి చేసుకోలేదు..? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శోభన అసలు పేరు చంద్ర కుమారి పిళ్ళై. కేరళలో జన్మించిన ఈమె అలనాటి నటీమణులు లలిత, పద్మిని, రాగిణిలకు మేనకోడలు అవుతుంది. వీరి అండ దండలతోనే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శోభన 1980, 90లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగింది. ఈ క్రమంలోనే ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా తీసుకుంది. అదే సమయంలో ఓ మలయాళ నటుడితో శోభన ప్రేమలో పడిందట.అతడినే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని ఎన్నో ఆశలు పెట్టుకుందట. కానీ, సదరు మలయాళ నటుడు మాత్రం తన ఇంటిలో చూసిన సంబంధం చేసుకుని శోభనకు ఊహించిన షాక్ ఇచ్చాడు. అతడు చేసిన మోసంతో తీవ్రంగా కృంగిపోయి పెళ్లిపై విరక్తి పెంచుకున్న శోభన.. ఇప్పటికీ ఒంటరిగానే ఉండి పోయింది. ప్రస్తుతం అడపా తడపా సినిమాలు చేస్తూనే చెన్నైలో కలర్పణ పేరుతో డాన్సింగ్ స్కూల్ నిర్వహిస్తున్న ఈమె.. మరో వైపు ఓ అమ్మాయిని దత్తత తీసుకుంది. ఆ ఆమ్మాయినే తన కూతురిగా చూసుకుంటూ శోభన లైఫ్ లీడ్ చేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి