‘ఆర్ ఆర్ ఆర్’ ఇప్పటికి అనేక సార్లు వాయిదా పడింది. ఇన్ని వాయిదాలు మరొక సినిమా విషయంలో జరిగితే ఆమూవీ పై క్రేజ్ పూర్తిగా తగ్గిపోతుంది. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో అలా జరగడంలేదు. రాజమౌళి మ్యాజిక్ ఈమూవీ పై మ్యానియాను తగ్గించకుండా మరింత పెంచుతోంది.


ఇప్పటికే కరోనా ఒమైక్రాన్ పరిస్థితులతో పాటు ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ల రేట్ల పెంపుదల విషయమై అనేక అయోమయాలకు లోనవుతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ ఈ సమస్యల నుండి ఎలా గట్టెక్కాలి అన్న ఆలోచనలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ పై మరో ఊహించని పిడుగు పడింది.


ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా అడ్డుకట్ట వేయాలి అంటూ ఆంధ్రప్రదేశ్ లోని ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య హైకోర్ట్ కు ఎక్కడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో మాత్రమే కాకుండా మీడియా వర్గాలలో కూడ హాట్ టాపిక్ గా మారింది. ఈమె దాఖలు చేసిన పిటీషన్ లో కొన్ని ఆసక్తికర విషయాలు బయట పడుతున్నాయి.


చరిత్రలో ఎక్కడా అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ ఉత్తరాది ప్రాంతానికి వెళ్ళినట్లు కానీ వారిద్దరు కలిసి బ్రిటీష్ వారి పై పోరాటం చేసినట్లు ఎక్కడా ఎటువంటి రుజువులు లేవనీ చరిత్రలో లేని అంశాన్ని ఈ మూవీ రచయిత దర్శకుడు ఊహించుకుని అల్లూరి కొమరం భీమ్ లు వారి అజ్ఞాత జీవితంలో ఒకచోట కలిసి బ్రిటీష్ వారి ఫై పోరాటం చేసినట్లు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో ఉందని సౌమ్య చెపుతున్నట్లు మాటలు వస్తున్నాయి. చరిత్రలో లేని విషయాన్ని ఉన్నట్లుగా ఊహించుకుని తీసిన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని చూసిన వారికి తప్పుడు సంకేతాలు వెళతాయి అంటూ ఆమె చేస్తున్న వాదనను కోర్టు అంగీకరిస్తే ‘ఆర్ ఆర్ ఆర్’ కు మరింత చిక్కులు తప్పవు అంటూ మాటలు వస్తున్నాయి. త్వరలో ఈ విషయమై కోర్టులో విచారణ మొదలుకాబోతున్నట్లు తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: