అందాల ముద్దుగుమ్మ రీతూ వర్మ, విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో రీతు వర్మ కి టాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఇలా మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న రీతు వర్మ తెలుగుతో పాటు ఇతర భాష సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజుల క్రితమే టక్ జగదీష్, వరుడు కావలెను సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. ఈ రెండు సినిమాలలో టక్ జగదీష్ సినిమా నేరుగా ఓటిటి లో విడుదల కాగా, వరుడు కావలెను సినిమా థియేటర్ లలో విడుదలయ్యింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రీతు వర్మ, శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ఓకే ఓకే జీవితం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 
ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. తన షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉండే ఈ హాట్ బ్యూటీ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని రోజుల క్రితం కూడా ఈ ముద్దుగుమ్మ కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో రీతు వర్మ టేబుల్ వెనకాల కూర్చొని తన హాట్ హాట్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. రీతు వర్మ కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు ఎప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: