టాలీవుడ్ యంగ్రీ హీరో రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి మంచి సినిమాలతో ఆకట్టుకుంటున్నాడని చెప్పాలి.  గరుడవేగ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన ఈ హీరో మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని భావించి సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం శేఖర్ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. వాస్తవానికి సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచన చేయగా ఎందుకో అది వర్కౌట్ కాలేదు. దాంతో ఈ సినిమాను విడుదల చేయడానికి మరొక మంచి ముహూర్తం కోసం చూస్తున్నాడు.

ఇప్పుడు ఉన్న సీనియర్ టాప్ హీరోలకు పోటీగా అప్పట్లో మంచి మంచి సినిమాలను తెరకెక్కించిన రాజశేఖర్ టాప్ హీరోగా లకు పోటీ ఇచ్చాడు. కానీ ఎందుకో ఆయన కొన్ని సినిమాల ఎంపిక కారణంగా వారి స్థాయికి వెళ్ల లేక పోయాడు. ఇప్పుడు ఆయన సినిమాలు ఎంచుకునే ప్రక్రియ చాలా బాగుంది. అప్పుడు కూడా బాగానే ఉన్నా కూడా మధ్యలో కొంత ఇబ్బందులు రావడం వల్ల ఆయన స్టార్ గా ఎదగలేక పోయారు. మరి ఇప్పుడు ఆ లోపాలను సరి చేసుకుంటాడా అనేది చూడాలి. 

ఇక రాజశేఖర్ ఎన్టీఆర్ 30 వ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అయితే కొంతమంది సినిమా విశ్లేషకులు రాజశేఖర్ ఈ తరహా పాత్రలో ఎప్పుడో చేయాల్సి ఉంది అని ఆయనకు సలహాలు ఇస్తున్నారు. జగపతిబాబు శ్రీకాంత్ వంటి హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులు గా ఎప్పుడో నటించడం మొదలు పెట్టారు. వారి కెరీర్ ఇప్పుడు ఎంత బిజీ గా ఉందో అందరికీ తెలిసిందే. అలా రాజశేఖర్ కూడా ఎప్పుడో తన ఇమేజ్ విషయాన్ని గుర్తించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిర పడిపోతే ఇప్పుడు ఆయన లెవెల్ వేరేలా ఉండేది అని వారు చెబుతున్నారు. మరి ఇప్పటికైనా ఆలస్యం అయ్యింది లేదు. కాబట్టి ఎన్టీఆర్ సినిమా తర్వాత వరుసగా ఆ తరహాలో పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పిస్థే బాగుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: