త్రి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న జంట ధనుష్, ఐష్.ఈ సినిమా ఐష్ దర్శకత్వం వహించారు. ఐష్ రజనీకాంత్ పెద్ద కూతురు.ఈ సినిమా తరువాత సంగీత దర్శకులు అనిరుధ్ మంచిగా పాపులర్ అయ్యారు. ఇవన్నీ సినిమా ముచ్చట్లు.నిజ జీవితంలో ధనుష్ ను చూస్తే అంతగా ఎవ్వరూ పట్టించుకోరు.చాలా సింపుల్ గా ఉంటారు.ఎవ్వరితోనూ ఏ కయ్యం ఉండదు.ఇండస్ట్రీ అంటేనే ఎఫైర్లు కానీ ఆయన మాత్రం అలా ఉండరు.ఓ విధంగా స్టార్ హీరో ఇంటికి అల్లుడు అనే ఫీలింగ్ ఆయన రానీయరు గాక రానీయరు. మరి! ఎందుకీ దూరం? ఏమిటో ఈ మౌనం.
ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ధనుష్ ప్రకటన మేరకు  తమ దారులు వేరు అన్న నిర్ణయంతోనే విడాకులు తీసుకుంటున్నాం అనే సంచలన ప్రకటన ఒకటి చేశారనే తెలుస్తోంది. ఇంతకాలం అడ్జెస్ట్మెంట్ అన్న పదానికి ఇప్పుడు అర్థం లేకుండా పోయిందా లేదా అడ్జస్ట్ కాలేక వేరే దారులు చూసుకోవడంలో ఏమయినా  కొత్త ప్రపంచానికి వెతుకులాట తోడయిందా? ఇవే ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్నలు ధనుష్ అభిమానులను అదేవిధంగా రజనీ అభిమానులను కూడా! ఇప్పుడు సూపర్ స్టార్ ఇంట కలతలు.. ఏడాది ఆరంభంలో కలతలు..వీటికి సమాధానం ఎవరిస్తారో మరి!
కలిసి ఉండడం కన్నా విడిపోవడం మేలు అని ఏ విడాకుల ప్రకటన చూసినా అర్థం అయ్యేది ఇదే! నిజంగానే మనుషులు అంతగా కలిసి ఉండలేకపోతున్నారా? అన్నది ఓ న్యాయ సంబంధం అయిన ప్రశ్న. కోర్టులో కూడా వినిపించే సర్వ సాధారణ ప్రశ్న. సాధారణ వ్యక్తులే వీళ్లు కనుక వీళ్లలో ఏ అసాధారణ ప్రజ్ఞనో చూసి ప్రేమించడం మినహా వీళ్లకు భావోద్వేగాలు ఏవీ అదుపులో ఉండవని తేలిపోయింది.ఇక ఆ చిన్నారుల సంరక్షణ ఎవరు తీసుకుంటారు? ఎవరు బాధ్యత వహిస్తారు? విడిపోతున్నవారు కనీసం ఆ బిడ్డల ముఖాలను ఎందుకు చూడలేకపోతున్నారు.. ఏదేమయినప్పటికి 18ఏళ్ల బంధం పిల్లలపరంగా అయినా కలిపి  ఉంచలేకపోయిందని విచారపడదాం.అభిమానుల పరంగా అదేవిధంగా మరికొన్ని విషయాలను పరిగణనలో ఉంచుకుని వారి నిర్ణయాన్ని గౌరవిద్దాం. ఇదే ధనుష్ విన్నపం కూడా!


మరింత సమాచారం తెలుసుకోండి: