తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు పొందాడు కృష్ణవంశీ.. ఆయన ఏ సినిమా చేసిన తనకు నచ్చిన విధంగానే చేస్తూ ఉంటాడు. ఈ విషయంలో మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా రాజీపడరు. కథ విషయంలో, బడ్జెట్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వరు కృష్ణవంశీ.. సినిమా పెట్టుబడి కాస్త పెరిగిన.. తను అనుకునే విధంగా సినిమా రావాలనే ఉద్దేశం గల డైరెక్టర్ కృష్ణ వంశీ. అయితే గత కొద్ది సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉండి ప్రస్తుతం రంగమార్తాండ సినిమాని తెరకెక్కించడం జరుగుతోంది.

అయితే ఈ సినిమా మరాఠీ రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించిన.. ఒక నటసామ్రాట్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా కథని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఇందులో కీలకమైన పాత్రలో నానాపటేకర్ పాత్ర. ఇక ఇతని స్నేహితుడు విక్రమ్ గోఖలే పాత్ర కూడా ఈ సినిమాకి హైలెట్ గా ఉండనుంది. అయితే ఈ పాత్రలకి ఎవరెవరు నటిస్తారనే విషయం బాగా చర్చనీయాంశంగా మారింది. ఎట్టకేలకు నానాపటేకర్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు.. ఇక ఈ సినిమాకి కీలకమైన పాత్ర విక్రమ గోకలే పాత్ర. కానీ ఈ పాత్రలో ఎవరు నటిస్తారనే విషయంపై ఇప్పుడు సమస్యగా మారింది.. అయితే ఈ పాత్ర పై కూడా ఇండస్ట్రీ వర్గాలలో బాగా చర్చ జరిగిందట. అలనాటి హీరో ఈ పాత్రకు ఉచితంగా నటిస్తానని చెప్పినప్పటికీ.. కృష్ణవంశీ ఈ ఆఫర్ను తిరస్కరించారట..

ఈ వార్త సినీ ఇండస్ట్రీలో తెలియగానే.. కృష్ణవంశీకి ఏంటి ఈ ధైర్యం.. ఈ పాత్రను మరి ఎవరిని తీసుకోబోతున్నాడు అనే వార్త బాగా వినిపించింది. అయితే కృష్ణవంశీ మాత్రం ఈ పాత్రలో కేవలం బ్రహ్మానందాన్ని మాత్రమే ఊహించుకున్నాను అని తెలియజేశాడు. అయితే అనుకున్నట్టుగానే బ్రహ్మానందాన్ని ఒప్పించి ఈ సినిమాకి ఫైనల్ చేశాడు.. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నది. అయితే ఇప్పటి వరకు బ్రహ్మానందం కేవలం ఒక్క సినిమాలోనే సీరియస్ పాత్రలో నటించారు.. అదే బాబాయ్ హోటల్. ఇక ఆ తర్వాత ఈ సినిమాలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: