సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు తీసుకుంటున్న పలు నిర్ణయాలు ఆయన అభిమానులను ఎంతగానో టెన్షన్ పెడుతున్నాయని చెప్పవచ్చు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు ను తెరపై చూసి రెండేళ్ళు దాటుతున్నా క్రమంలో తమ అభిమాన హీరో ను ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్లుగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు.  ఈ నేపథ్యంలోనే ఆయన తన సర్కారు వారి పాట సినిమా ను తొందరగా విడుదల చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ సినిమా మరింత ఆలస్యం అవడం వారిని ఎంతగానో నిరాశపరుస్తుంది.

మరోవైపు త్రివిక్రమ్ సినిమాను కూడా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్న మహేష్ బాబు ఇప్పుడు దాన్ని మొదలు పెట్టవద్దు అనే ఆలోచన చేస్తుండడం అభిమానులను మరింత టెన్షన్ పెడుతోందట. ప్రస్తుతం కరోనా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ను వాయిదా వేయాలని మహేష్ బాబు నిర్ణయించుకున్నాడట.  ఇటీవలే మహేష్ బాబుకు శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఓ ప్రమాదంలో ఆయన కాలు కు గాయం కాగా దానికి శస్త్ర చికిత్స చేశారు. అయితే డాక్టర్లు నాలుగు నెలల విశ్రాంతి సూచించారు.

ఆ విధంగానే ప్రస్తుతం తన భవిష్యత్తు సినిమాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను చూసుకుంటున్న మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా మొదలుపెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదు. డాక్టర్లు సూచించిన విశ్రాంతి కూడా ఇంకా మూగియక పోవడంతో ఈ సినిమాను మరొక రెండు నెలల తర్వాత మొదలుపెట్టి ఆగస్టు కు విడుదల చేయాలని ఆయన భావిస్తున్నాడట. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా ఆగస్టులో విడుదల అవ్వడం అంటే అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించినట్లే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో అభిమానుల బాధను అర్థం చేసుకొని మహేష్ బాబు తొందరగా ఈ సినిమా ను విడుదల చేస్తారు అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: