స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ గా మారిన వేళ మరింత క్రేజ్ పెరిగిపోయింది అని చెప్పవచ్చు. ఒకవైపు సినిమాలు మరొకవైపు వ్యాపారాలు అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆర్థిక పరంగా బాగా దినదినాభివృద్ధి చెందుతున్నాడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం సమాజం లోమనం గమనిస్తున్న విషయం ఏమిటంటే జీవితంలో చాలామంది ఒక ఎత్తుకు ఎదిగిన తర్వాత కన్న తల్లిదండ్రులను.. పుట్టి పెరిగిన ఊరు ను మర్చిపోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పుట్టిన ఊరికి.. ఇచ్చిన మాటను మర్చిపోకుండా మరొకసారి ఈ విషయాన్ని నిరూపించారు..


పుట్టిన ఊరు పాలకొల్లు అయితే కొంతకాలం క్రితం ఆ ఊరిలో ఒక గుడి నిర్మాణం చేస్తానని  మాట ఇచ్చారు. అయితే ఇప్పుడు తన మాటను నిలబెట్టుకోవడానికి ఏకంగా 20 లక్షల రూపాయలను విరాళం ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు. పాలకొల్లులో వారి ఇంటి దేవుడు అయినటువంటి శ్రీ క్షీరా రామ లింగేశ్వర స్వామి గుడి  కోసం 20 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు ఇక పోతే ఈ డబ్బుతో రథశాల, వహనశాల , గోశాల కూడా నిర్మించారు.. ఇంకా మిగిలిన డబ్బుతోనే శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి రథాన్ని కూడా తయారు చేయించినట్లు సమాచారం.. ఇకపోతే సంక్రాంతి పండుగ కు ముందే ఈ గుడికి సంబంధించిన రెనోవేషన్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పరమశివుడి పంచారామ క్షేత్రాలలో పాలకొల్లు లో వెలసిన శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి దేవాలయం కూడా ఒకటి కావడం గమనార్హం.


ఇక అల్లు అర్జున్ స్వామి వారి ఆశీస్సులతో నే ఇంత ఎత్తుకు ఎదిగారు అని ఆ కుటుంబ సభ్యులు నమ్మడం కారణం చేత వారి దేవుడికి వారు ఇలా విరాళాలు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం పుష్ప పాన్ ఇండియా సినిమా  సక్సెస్ తర్వాత  పుష్ప రెండవ భాగం షూటింగ్ లో బిజీ గా వున్నారు బన్నీ.

మరింత సమాచారం తెలుసుకోండి: