నందమూరి నటసింహం బాలకృష్ణ  హీరోగా, టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ, ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా, శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు, మరొక ప్రధాన పాత్రలో పూర్ణ కూడా ఈ సినిమాలో నటించింది, ఈ సినిమాపై ప్రేక్షకులలో ముందు నుండే మంచి అంచనాలు ఉన్నాయి, దానికి ప్రధాన కారణం బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ఇదివరకే సింహ, లెజెండ్ లాంటి రెండు మాస్ బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కడమే, ఇలా మొదటి నుండి ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు కలిగివున్న ఈ సినిమా డిసెంబర్ 2 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది, ఈ సినిమా థియేటర్ లలో ఈ మధ్యనే విడుదలై 50 రోజులు పూర్తి చేసుకుంది.

 ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర వంద కోట్ల వరకు కలెక్షన్ లను కూడా సాధించింది. అయితే ఈ సినిమా కొన్ని రోజుల క్రితం నుండే ప్రముఖ ఓటిటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్   లో స్ట్రీమ్మింగ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదలై 50 రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ, అలాగే ఓ టి టి లో ప్రసారం అవుతున్నప్పటికీ ఈ సినిమాకు క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు, అయితే ఈ సినిమాను హిందీలో విడుదల చేయాలని బాలీవుడ్ ప్రేక్షకులు కోరుతున్నారు, అయితే హిందీ ప్రేక్షకుల కోరిక మేరకు ఈ సినిమాను బాలీవుడ్ లో విడుదల చేస్తారో లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. అప్పట్లో ఈ సినిమాను అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవగన్ హీరోలుగా రీమేక్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: