యువసామ్రాట్,యంగ్ టైగర్ ల మధ్య బాక్సాఫీస్ వద్ద ఐదు సార్లు క్లాష్ వచ్చింది. మరి వాటిలో ఎవరు విజయాన్ని, ఎవరు పరాజయాన్ని అందుకున్నారో తెలుసుకుందాం.
 ముందుగా ఎన్టీఆర్ వెండితెరపై బుడిబుడి అడుగులు వేసుకుంటూ వస్తూనే నాగార్జునతో పోటీపడ్డారు. అదే బాల రామాయణం సినిమాతో గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బాలలతో రామాయణ గాథను కళ్ళకు కట్టినట్లుగా చూపించి కొంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుని యావరేజ్ టాక్ తెచ్చుకున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 14,1996 లో రిలీజ్ అవ్వగా ఇది వచ్చిన 11 రోజులకే ఏప్రిల్ 25న నాగార్జున నటించిన రాముడొచ్చాడు సినిమా వచ్చింది. పక్కా విలేజ్ బ్యాక్ గ్రౌండ్ తో  కొనసాగే ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ప్రముఖ పాత్ర పోషించారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పూర్తిగా పరాజయాన్ని చూసింది.


ఇలా మొదటి సారి పోటీలో ఎన్టీఆర్ యావరేజ్ ని, నాగార్జున ఫ్లాప్ ని చూశారు. రెండోసారి ఎన్టీఆర్ హీరోగా అవతారమెత్తిన తొలి సినిమాతోనే మళ్లీ నాగ్ కి ఎదురెల్లారు. అదే నిన్ను చూడాలని సినిమాతో. యూత్ ఫుల్ రొమాంటిక్ మూవీ గా వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ యాక్టింగ్ బాగున్నా, కథ లోపంతో ఈ మూవీ ప్లాప్ టాక్ ని మూటగట్టుకుంది. ఈ సినిమా 2001, మే 23న రిలీజ్ అవ్వగా, ఇక దీనికి రెండు వారాల గ్యాప్ తో జూన్ 7న నాగార్జున నటించిన బావనచ్చాడు సినిమా. ఈ మూవీ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతూ భారీ పరాజయాన్ని చూడాల్సి వచ్చింది. ఇలా ఈసారి క్లాష్ లో ఇద్దరు ప్లాప్ భారన్నే మూటకట్టుకున్నారు. ఇక మూడో సారి ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్యాతో వస్తే, నాగార్జున భాయ్ సినిమాతో పలకరించారు. ఎన్టీఆర్ మూవీ 2013 అక్టోబర్ 11 రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్నే చూసింది. ఇక దీనికి రెండు వారాల తర్వాత అక్టోబర్ 25న వచ్చిన నాగార్జున భాయ్ సినిమా కూడా ప్రేక్షకాదరణ పొందలేదు. ఇలా మూడోసారి క్లాష్ లో కూడా ఈ ఇద్దరు హీరోలు పరాజయాన్నే చూశారు. 2016 సంక్రాంతి సీజన్లో వీరిద్దరి మధ్య మళ్ళీ క్లాష్ వచ్చింది. ముందుగా ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో జనవరి 13న రిలీజ్ అవ్వగా, దీనికి రెండు రోజుల తర్వాత జనవరి 15న నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన వచ్చింది. పూర్తి కమర్షియల్ తో వచ్చిన ఈ రెండు సినిమాలు  ప్రేక్షకాదరణ పొందాయి. నాన్నకు ప్రేమతో సినిమా అద్భుతమైన కలెక్షన్లు కొల్లగొట్టింది. సోగ్గాడే చిన్నినాయన కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇలా ఈపోటీలో ఎన్టీఆర్,నాగార్జున ఇద్దరు గ్రాండ్ సక్సెస్ లే అందుకున్నారు.

 ఇక చివరిగా వీరి మధ్య వచ్చిన క్లాష్ ఇయర్ 2018. ఈసారి ముందుగా నాగార్జున నటించిన దేవదాసు  సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అయింది. నానితో కలిసి నాగ్ నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఏమాత్రం అందుకోలేకపోయింది. ఈ సినిమాకు రెండు వారాల గ్యాప్ తో అక్టోబర్11న ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమా రిలీజ్ అయింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ కెరియర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా ఈసారి క్లాష్ లో ఎన్టీఆర్ పైచేయి సాధించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: