మెగా మేనల్లుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో వివాహం అనంతరం స్నేహ రెడ్డి కూడా పెద్ద సెలబ్రెటీలా మారిపోయారు. మెగా ఫ్యామిలీ అభిమానులు స్నేహ ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటి అని తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉంటున్నారు. సోషల్ మీడియాలోనూ ఆమెకి చాలా ఫాలోయింగ్ ఉంది, నిత్యం బన్నీ అభిమానులకు టచ్ లో ఉంటూ తన ఫ్యామిలీ గురించి భర్త బన్నీ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే స్నేహ రెడ్డి గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇపుడు తెలుసుకుందాం.

స్నేహ 1985 సెప్టెంబర్ 29 న జన్మించారు. అంటే ఇప్పటికీ ఈమె వయసు 36 సంవత్సరాలు అయినా తరగని అందంతో 16 నాళ్ళ బుట్టబొమ్మలా ఎంతో యంగ్ గా కనిపిస్తున్నారు స్నేహ. ఈమె మన హైదరాబాదీనే కంచర్ల చంద్ర శేఖర్ రెడ్డి అనే ప్రముఖ బిజినెస్ మ్యాన్ కుమార్తె. తల్లి పేరు కవిత రెడ్డి. స్నేహకు నగు రెడ్డి అనే సోదరి కూడా ఉన్నారు. స్నేహ ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో తన మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేశారు. ఈమె ఫేవరెట్ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అల్లు అర్జున్, ఇక హీరోయిన్ ఆలియా బట్ అని సోషల్ మీడియా ద్వారా తెలిసింది.

సోషల్ మీడియాలో స్నేహ రెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదు, స్టార్ హీరోయిన్లకు మించిన క్రేజ్ ఆమె సొంతం. ఏకంగా నాలుగు మిలియన్ల ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న ఘనత ఆమెకు దక్కింది.  ఈమెకు ఫిట్ నెస్ అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ద చాలా ఎక్కువ. వర్కౌట్ రెగ్యులర్ గా చేస్తూ యోగ వంటి వాటిపై కూడా ప్రత్యేక దృష్టి పెడతారు స్నేహ. ఇక తన కుటుంబాన్ని పిల్లలు అయాన్, అర్హ లను చూసుకోవడంలో ఎప్పుడూ బిజీగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: