కరోనా కారణంగా సినిమాలు కూడా ఒక ప్రణాళిక ప్రకారం కాకుండా సేఫ్ టైమింగ్ ను చూసుకుని రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని పెద్ద పెద్ద సినిమాలు తమ విడుదలను వాయిదా వేసుకుని త్వరలో రావడానికి కాచుకుని ఉన్నాయి. ఈ సమయం చిన్న సినిమాలకు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. అందుకే షూటింగ్ జరుపుకుంటున్న కొన్ని చిత్రాలు ఈ సమయంన్ని వాడుకోవాలని చూస్తున్నాయి. అందులో గోపిచంద్ హీరోగా తెరకెక్కుతున్న 'పక్కా కమర్షియల్' మూవీ కూడా వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా నుండి ఒక బిగ్ అప్డేట్ ఈ సినిమాపై అంచనాలను పెంచేదిలా ఉంది.

మారుతీ డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నుండి మొదటి సాంగ్ ను వచ్చే నెల 2 వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం ముహూర్తం పెట్టింది. ఈ విషయాన్ని కాసేపటి క్రితమే మీడియా ద్వారా తెలిసింది. అయితే ఈ పాటకు ఓ ప్రత్యేకత ఉంది 2021 లో చనిపోయిన ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ పాటను రచించండం జరిగింది. ఈయన చనిపోయిన తర్వాత పాటలు మూగబోయాయా అన్న విధంగా సినిమా ఇండస్ట్రీ అంతా చడీ చప్పుడు లేకుండా ఉంది. ఈయన లేకపోయినా ఈయన పాటలు ఇంకా కొన్ని సంవత్సరాల వరకు ప్రేక్షకులను హాయిగొల్పుతూనే ఉంటాయి.

ఈ పాట పల్లవి "జన్మించినా... మరణించినా... ఖర్చే ఖర్చు..." అని ప్రారంభం అవుతుంది. ఇక ఈ ఒక్క లైన్ తో పాట ఎలా ఉంటుందో ఊహించుకోగలము. ఒక మనిషి జీవితాన్ని డబ్బు ఎలా ఆడిస్తోంది అనేది ఈ పాటలో చెప్పి ఉంటారు అనిపిస్తోంది. కానీ అసలు పాటలో ఏముందో తెలియాలంటే ఇంకో మూడు రోజుల వరకు ఆగాల్సిందే. కాగా ఈ సినిమాలో గోపించంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఇతర పాత్రలలో సత్యరాజ్, రావ్ రమేష్, అనసూయ లు నటిస్తున్నారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందిస్తుండగా యువి క్రియేషన్స్ మరియు గీత ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: