తెలుగు చిత్ర పరిశ్రమలో బాహుబలి రికార్డులను ఇప్పటివరకు ఏ సినిమా బ్రేక్ చేయలేదు. ప్రపంచం స్థాయిలో రికార్డు లకు కైవసం చేసుకుంది. ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 8 వేల థియెటర్ల లో విడుదల అయ్యింది. ఇప్పుడు ఆ రికార్డులను ప్రభాస్ నటించిన మరో సినిమా బ్రేక్ చేసింది. రాధేశ్యామ్' ను మార్చి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 10 వేల థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. ఒక్క నార్త్ అమెరికాలో నే 2 వేల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. నిజంగా ఇది అంత తేలికైన విషయం కాదు ప్రపంచం మొత్తం ఈ సినిమా ఫీవర్ వ్యాపించిందని చెప్పాలి..


టాప్ హీరో ప్రభాస్, పాన్ ఇండియా సినిమాగా.. మరో వైపు విదేశాల్లో సినిమా షూటింగ్.. అద్భుతమైన గ్రాఫిక్స్ అన్నీ కూడా సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంతరవరకూ వదులుతూ వచ్చిన అప్ డేట్స్ అంతగా అంచనాలు పెంచుతూ వచ్చాయి. ఈ సినిమా లో ప్రభాస్ హస్త సాముద్రికుడుగా కనిపించనున్నాడు.. రొమాంటిక్ లవర్ పాత్రలో డార్లింగ్ కనిపిస్తున్నాడని ఇప్పటివరకు విడుదల అయిన పోస్టర్స్ ను చూస్తె తెలుస్తుంది.


ఇప్పటివరకు డార్లింగ్ కనిపించిన పాత్రలకు ఈ సినిమా భిన్నంగా వుంటుందని చిత్ర యూనిట్ వెల్లడించారు. మార్చి 11వ తేదీన విడుదల చేయనుండటం తో పాన్ ఇండియా స్థాయిలో నే ప్రమోషన్స్ మొదలుపెట్టవలసి ఉంటుంది. అందుకు తగిన స్థాయిలోనే ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ ను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. సినిమాకు ఎలా భారీ బడ్జెట్ ను ఇచ్చారో, ఇప్పుడు ప్రమోషన్స్ ను కూడా అలాగే భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది.. ఇప్పటి వరకు సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉంటుంది అనేది సినిమాలో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: