మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతో కాలం పాటు టాప్ హీరోయిన్ గా కొనసాగింది,  ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతో కాలం పాటు టాప్ హీరోయిన్ గా కొనసాగిన మిల్కీబ్యూటీ తమన్నా టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయం లోనే స్పెషల్ సాంగ్ లలో కూడా నటించి ప్రేక్షకులను ఫిదా చేసింది.  తమన్నా కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా కోలీవుడ్ , బాలీవుడ్ సినిమాలలో కూడా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది,  ఇలా సినిమాలతో,  స్పెషల్ సాంగ్ లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా కొన్ని రోజుల క్రితం మాస్టర్ చెఫ్ అనే బుల్లి తెర టీవీ షో కు కూడా హోస్ట్ గా వ్యవహరించింది.  

బుల్లి తెర టీవీ షో కు హోస్ట్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా తమన్నా ఇప్పటికే నవంబర్ స్టోరీస్, లెవెన్త్ పవర్ అనే రెండు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది,  ఇది ఇలా ఉంటే తమన్నా  కేవలం హీరోయిన్ పాత్రల కోసం మాత్రమే ఎదురు చూడకుండా  తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఇప్పటికి కూడా హీరోయిన్ గా వరుస అవకాశాలు చేజిక్కించుకుంటుంది,  ప్రస్తుతం తమన్నా 'భోళా శంకర్'  సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది,  ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు,  ఈ సినిమాతో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా వెంకటేష్ సరసన ఎఫ్ 3 సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.  ఇలా సినిమాలలో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా ప్రస్తుతం గని సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది,  ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది,  ఇలా తమన్నా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఇప్పటికి కూడా వరుస అవకాశాలతో ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: