టాలీవుడ్ క్రేజీ హీరో లో ఒకరైన శ్రీ విష్ణు తాజాగా భళా తందనానా సినిమాలో హీరోగా నటించిన విషయం మన  అందరికీ తెలిసిందే.  ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన కాథరీన్ హీరోయిన్ గా నటించింది.  భళా తందనానా మూవీ కి చైతన్య దంతులూరి దర్శకత్వం వహించగా, సాయి కొర్రపాటి సమర్పణలో బాలాజీ చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు.  కొన్ని రోజుల క్రితం ఈ సినిమా ఏప్రిల్ 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.  కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను ఏప్రిల్ 30 వ తేదీన చిత్ర బృందం విడుదల చేయలేక పోయింది.  

తాజాగా ఈ సినిమాను మే 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల అవుతున్న  రోజు మరో రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి.  ఈ రెండు సినిమాలకు కూడా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండటంతో శ్రీ విష్ణు సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఈ సినిమా విడుదల అవుతున్న మే 6 వ తేదీన విశ్వక్సేన్ హీరోగా తెరకెక్కిన అశోక వ‌నంలో అర్జుణ క‌ళ్యాణం  సినిమా విడుదల కాబోతోంది.

సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.  ఈ సినిమాతో పాటు సుమ కనకాల ప్రధాన పాత్రలో తెరకెక్కిన జయమ్మ పంచాయతీ సినిమా కూడా మే 6 వ తేదిన విడుదల కాబోతుంది. ఈ సినిమాపై కూడా ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.  ఇలా ఈ రెండు సినిమాల నుండి శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన  భళా తందనానా  సినిమాకు గట్టిపోటీ బాక్సాఫీస్ దగ్గర ఎదురుకానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: