ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. థమన్ పాటలకు, బీజీఎంకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడుతున్నాయి.

ప్రస్తుతం టాలీవుడ్ నంబర్1 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు థమన్ పేరు సమాధానంగా వినిపిస్తోందట.ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా థమన్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయట. అయితే థమన్ తను మ్యూజిక్ అందించిన సినిమాలలో హీరోలతో పాటలు పాడించడానికి ఆసక్తి చూపిస్తారనే విషయం తెలిసిందే.

ఇప్పటికే పలువురు టాప్ హీరోలతో థమన్ పాటలు పాడించారట. మహేష్ బాబుతో కూడా థమన్ పాట పాడిస్తే బాగుంటుందని మహేష్ బాబు అభిమానులు కోరుకుంటున్నారట. అయితే మహేష్ తో పాడించాలని ట్రై చేసి తాను ఫెయిలయ్యానని థమన్ చెప్పారు.. బిజినెస్ మేన్ మూవీలో మహేష్ బాబుతో పాడించాలని తాను ప్రయత్నించానని మహేష్ రెండు గంటల్లో బయటకు వచ్చి ఈ వ్యవహారంతో నాకు సంబంధం లేదు బ్రదర్ అని చెప్పాడని థమన్ తెలిపారట..

 

మహేష్ తో పాట పాడించకపోయినా బిజినెస్ మేన్ లోని పాటలో డైలాగ్స్ చెప్పించానని థమన్ కామెంట్లు చేశారట.. ఆ డైలాగ్స్ చాలా వైరల్ అయ్యాయని ఎంతోమంది ఆ డైలాగ్స్ ను రింగ్ టోన్స్ గా కూడా పెట్టుకున్నారని థమన్ చెప్పుకొచ్చారు. మహేష్ ను మాత్రం వదిలేది లేదని భవిష్యత్తులో మహేష్ కోసం ఒక పాటను కంపోజ్ చేస్తానని థమన్ కామెంట్లు కూడా చేశారు. మహేష్ తో ర్యాప్ సాంగ్ పాడించాలనే ఆలోచన తనకు ఉందని అన్నారు.

 

థమన్ దూకుడు సినిమా కోసం తొలిసారి మహేష్ బాబు సినిమాకు పని చేసిన విషయం తెలిసిందే. మహేష్ నటించిన బిజినెస్ మేన్, ఆగడు సినిమాలకు సైతం థమన్ సంగీత దర్శకుడు కావడం విశేషం.. సర్కారు వారి పాట సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. కళావతి, మ మ మహేషా పాటలు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయని తెలుస్తుంది.. అయితే థమన్ బీజీఎం మాత్రం ఆశించిన స్థాయిలో లేదని నెటిజన్లు కామెంట్లు అయితే చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: