‘సర్కారు వారి పాట’ రిజల్ట్ తెలిసిపోవడంతో ఈనెల 27న సమ్మర్ రేస్ కు ముగింపు పలుకుతూ విడుదలకాబోతున్న ‘ఎఫ్ 3’ గురించి చర్చలు మొదలయ్యాయి. ఈమూవీ ట్రైలర్ కు భారీ స్పందన రావడంతో ఈమూవీలో కూడ అనీల్ రావిపూడి మ్యాజిక్ వర్కౌట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనాలు కడుతున్నాయి. అయితే ఈసినిమా ఘన విజయానికి నిర్మాత దిల్ రాజ్ సరికొత్త వ్యూహాలు ఆలోచిస్తున్నట్లు టాక్.


ఇప్పటివరకు విడుదలైన ‘ఆర్ ఆర్ ఆర్’ ‘ఆచార్య’ ‘రాథే శ్యామ్’ ‘సర్కారు వారి పాట’ సినిమాలకు ప్రభుత్వ అనుమతులతో వీలైనంత స్థాయిలో టిక్కెట్ రేట్లు పెంచుకుని ప్రేక్షకుల నుండి ఎంతవరకు రాబట్టాలో అంత రాబట్టుకున్నారు. అయితే దీనికి భిన్నంగా ‘ఎఫ్ 3’ సినిమా టిక్కెట్ల విషయంలో పెంపుదల విషయమై ఈమూవీ నిర్మాతలు భిన్నంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.


తెలుస్తున్న సమాచారంమేరకు ఈమూవీ టిక్కెట్ల రేట్ల పెంపుదల కోసం ప్రభుత్వాల నుంచి అనుమతుల కోసం ఈమూవీ నిర్మాతలు ప్రయత్నించరని టాక్. దీనికి కారణం ‘ఎఫ్ 3’ మూవీ ఘనవిజయం సాధించాలి అంటే ఈమూవీకి మధ్యతరగతి ఫ్యామిలీ ఆడియన్స్ కూడ వచ్చినప్పుడు మాత్రమే తాము కోరుకున్న కలక్షన్స్ టార్గెట్ అందుకుంటాము అన్నఆలోచనలు అని అంటున్నారు.


దీనికితోడు ఈమూవీలో హీరోలుగా నటించిన వెంకటేష్ వరుణ్ తేజ్ లకు మాస్ ఫాలోయింగ్ చాల తక్కువ కాబట్టి టిక్కెట్ల రేట్లు విపరీతంగా పెంచితే ఈమూవీ ఓపెనింగ్స్ పై భారీగా ప్రభావం పడుతుందనే ఆలోచనలతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈమూవీ బడ్జెట్ కూడ మరీ అంత ఎక్కువకాదు కాబట్టి టిక్కెట్ల రేట్లు తక్కువగా ఉన్నా బయ్యర్లకు వచ్చే సమస్య పెద్దగా ఉండదని కేవలం ఈమూవీకి పాజిటివ్ టాక్ వస్తే సరిపోతుంది అన్న అభిప్రాయం కూడ దిల్ రాజ్ కు ఉన్నట్లు తెలుస్తోంది. అనీల్ రావిపూడి ఈమూవీతో కూడ విజయం సాధిస్తే టాప్ డైరెక్టర్స్ లో అతడి స్థానం సుస్థిరం అవుతుంది అనుకోవాలి..  




మరింత సమాచారం తెలుసుకోండి: