ఈ వారం కొన్ని మూవీలు థియేటర్ లలో సందడి చేయబోతుంటే మరి కొన్ని సినిమాలు 'ఓ టి టి' లో సందడి చేయబోతున్నాయి ఆ సినిమాల గురించి తెలుసుకుందాం.

ఈ వారం థియేటర్ లలో విడుదల కాబోయే సినిమాలు...
ఎఫ్ 3 : అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్  హీరోయిన్లుగా తెరకెక్కిన ఎఫ్ 3 మూవీ మే 27 వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది. ఎఫ్ 3 లో సోనాల్ చౌహాన్ ఒక ముఖ్య పాత్రలో నటించగా,  ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు.


ఈ వారం 'ఓ టి టి' లో విడుదల కాబోయే సినిమాలు.


ఆకాశంలో అర్జున కళ్యాణం : వరుస పెట్టి మాస్ సినిమాలో నటిస్తూ వచ్చిన విశ్వక్ సేన్ తాజాగా ఆకాశం అర్జున కళ్యాణం అనే క్లాస్ సినిమాలో నటించాడు.  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమా మే 27 వ తేదీ నుండి ఆహా 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాబోతుంది.


కణ్మణి రాంబో ఖతీజా : విజ్ఞేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నయనతార, సమంత హీరోయిన్లుగా తెరకెక్కిన కణ్మణి రాంబో ఖతీజా మూవీ ఈ నెల 27 వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాబోతుంది.

 
అటాక్ : జాన్‌ అబ్రహం హీరోగా జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రకాశ్‌ రాజ్‌ ముఖ్య పాత్రల్లో నటించిన అటాక్‌ : పార్ట్‌ 1 మూవీ ఈ నెల 27 వ తేదీ నుండి జీ 5 'ఓ టి టి' స్ట్రీమింగ్ కాబోతుంది.

 
నెట్‌ఫ్లిక్స్‌ :
తులసీదాస్‌ జూనియర్‌ : మే 23
వెల్‌కమ్‌ టు వెడ్డింగ్‌ హెల్‌ : మే 23
స్ట్రేంజర్‌ థింగ్స్‌ (నాలుగో సీజన్‌) : మే 27


హాట్‌స్టార్‌ :
ఒబీ వ్యాన్‌ కెనోబి (వెబ్‌ సిరీస్‌) : మే 27


సోనీ లివ్‌ :
నిర్మల్‌ పాఠక్‌ కీ ఘర్‌ వాపసీ : వెబ్‌ సిరీస్‌ : మే 27
సేత్తుమాన్‌ : మే 27

మరింత సమాచారం తెలుసుకోండి: