టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోలలో ఒకరు ఆయన రామ్ పోతినేని ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది వారియర్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి  నటిస్తోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ పోతినేని, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు. రామ్ పోతినేని , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతుంది.

రామ్ పోతినేని మరియు బోయపాటి శ్రీను ఇద్దరికి కూడా ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా. ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని , బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా తర్వాత మరో క్రేజీ దర్శకుడితో సినిమాను లైన్  లో పెట్టినట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ దర్శకులలో ఒకరు అయిన హరీష్ శంకర్.  రామ్ పోతినేని, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే  సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే హరీష్ శంకర్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భవదీయుడు భగత్ సింగ్ సినిమాను తెరకెక్కించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే భవదీయుడు భగత్ సింగ్ సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది.  హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించబోయే భవదీయుడు భగత్ సింగ్ సినిమా పూర్తయ్యే లోపు రామ్ పోతినేని కూడా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా ను పూర్తి చేసుకొని,  ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: