నందమూరి హీరో తారకరత్న అసలు సినీ ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించడం లేదు. ఇక నందమూరి వారసులలో స్టార్ హీరో గా చలామణి అవుతున్న ఒకే ఒక్క వారసుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన ఒక్కడే పాన్ ఇండియా హీరో గా చలామణి అవుతూ నందమూరి కుటుంబం పేరు నిలబెడుతున్నాడు.ఇక తారకరత్న ఎందుకు ఇన్ని రోజులూ సినీ ఇండస్ట్రీకి బాగా దూరం కావాల్సి వచ్చింది అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. ఇకపోతే తాజాగా మహేష్ బాబు ఇంకా త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో నందమూరి తారక రత్న రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్త బాగా వైరల్ గా మారుతోంది. ఇక ఇకపోతే ఇంకా ఇన్నిరోజులు ఎక్కడున్నారు..? ఆయన ఏం చేశారు..? ఎందుకు ఆయన సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు..? అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. సీనియర్ స్టార్ హీరో ఎన్టీఆర్ తనయుడు నందమూరి మోహనకృష్ణ వారసుడిగా నందమూరి తారక రత్న 1983 జనవరి 8వ తేదీన జన్మించారు. రాముడి పాత్ర పోషించాలి అంటే నందమూరి కుటుంబానికే చెందినట్టుగా ఇక ఎన్టీఆర్ తర్వాత ఆ వంశానికి చెందిన బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు తారకరత్న కూడా ఎక్కువగా రాముడు పాత్రలు పోషించే వాళ్ళట.2002 వ సంవత్సరంలో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన తారకరత్న కొంత దాకా కూడా విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే నందమూరి వారసుడిగా ఎక్కువకాలం ఆయన ఇండస్ట్రీలో కొనసాగలేక పోయాడు.ఇక ఆ తరువాత యువరత్న, తారక్ ,భద్రాద్రి రాముడు ఇంకా అలాగే వెంకటాద్రి వంటి సినిమాలలో హీరోగా నటించినప్పటికీ ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయాడు కానీ అమరావతి సినిమా లో విలన్ గా నటించిన ఆయన దెబ్బకు నంది అవార్డును సైతం సొంతం చేసుకోవడం గమనార్హం.ఇకపోతే తారకరత్న సినిమాలు వరుసగా డిజాస్టర్ కావడంతో సహనం కోల్పోయి ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ బిజినెస్ చూసుకుంటున్నారు. ఇక ఇప్పుడు మళ్లీ మహేష్ బాబు సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వడానికి ఆయన రెడీ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: