నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు..ఇప్పుడు మరో హీరో ఎంట్రీ పై నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు..ఇలాంటి వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయం పై డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు.ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలవడంతో, ఆయన డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఉవ్విళ్లూరుతున్నారు.
 

ఇక ఈ డైరెక్టర్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'ఎఫ్3' బాక్సాఫీస్ వద్ద నవ్వుల పూవులు పూయిస్తూ సందడి చేస్తోంది. ఈ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వరుసగా వేసుకున్నాడు ఈ డైరెక్టర్. ఇక అనిల్ రావిపూడి ఎఫ్3 సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న తరుణంలో వరుసగా ఇంటర్వ్యూ లు ఇస్తూ వస్తున్నాడు.అనిల్ రావిపూడి తన నెక్ట్స్ ప్రాజెక్టు గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. తన నెక్ట్స్ మూవీని నటసింహం నందమూరి బాలకృష్ణతో చేయబోతున్నట్లు అనిల్ రావిపూడి తెలిపారు. ఈ సినిమాను తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండబోతున్నట్లు వెల్లడించాడు. అంతేగాక బాలయ్యను ఈ సినిమాలో చాలా కొత్తగా చూపించబోతున్నట్లు ఆయన అన్నారు..



బాలయ్య తో చెయ్యబోయే చేయబోయే సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ లేదని.. కేవలం బాలయ్యను దృష్టిలో పెట్టుకొనే తాను స్క్రిప్టు రెడీ చేశానని.. ఈ సినిమా నందమూరి అభిమానులకు ఖచ్చితంగా నచ్చుతుందని.. వారు ఈ సినిమాలో సరికొత్త బాలయ్యను చూస్తారని అనిల్ ధీమా వ్యక్తం చేశాడు. అంటే.. ఇంతకాలం సోషల్ మీడియాలో, ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న వార్తలకు అనిల్ రావిపూడి చెక్ పెట్టినట్లుగా అయ్యింది. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ తన డైరెక్షన్‌లో లేదని క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు మళ్లీ మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ అయోమయంలో పడిపోయింది..ఈ విషయం పై బాలయ్య అన్నా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: