రానా మాట్లాడుతూ గడచిన నాలుగేళ్లలో అడవులలోని ఎక్కువ షూటింగ్లు జరిగాయి. అక్కడ ఎక్కువగా తమ సమయాన్ని గడిపాను. విరాట పర్వానికి వచ్చేసరికి 90 లో జరిగే స్టొరీ అని తెలియజేశారు. దళం సభ్యులు అడవులలో ఉండే రోజులు, నాటి వాతావరణం వారు పడ్డ కష్టాల గురించి యదార్ధంగా తెరకెక్కించామని తెలిపారు. తన కెరియర్ లో మొట్టమొదటి సారిగా ఇలాంటి గ్రేట్ లవ్ స్టోరీ నేను చూశాను. చాలా లోతైన ప్రేమ కథ ఇది ప్రేమ కోసం ఒక వ్యక్తి ఎంత దూరం వెళ్తారు అనే విధంగా డైరెక్టర్ ఈ సినిమా కథను రాశారు..
అయితే ఈ కథ చదివినప్పుడు తనకు చాలా బరువు అనిపించిందని తెలియజేశారు. విరాట పర్వం లాంటి కథ ఎప్పుడు వినలేదు అంత భారం ఎప్పుడు తీసుకోలేదని తెలియజేశారు. ఇక రవన్న కాని దళం, సభ్యులు కాని, మరొక ఉద్యమ నాయకులు వంటి వారు ఎంతో ఖచ్చితమైన లక్ష్యంతో ఉండేవారు.. కుటుంబం స్నేహం బంధాల కన్నా ఎక్కువగా వారు సమాజంలోనే జీవించారు. అలాంటి వ్యక్తి గత ఎజెండా లేకుండా వెళుతున్న రవణ జీవితంలోకి.. వెన్నెల ప్రవేశిస్తే ఎలా ఉంటుందో అనే కథాంశంతో తెరకెక్కిన చేయడం జరిగిందని తెలిపారు. మహాభారతంలో విరాట పర్వం అనే అంశం నుంచి అజ్ఞాత వ్యాసానికి సంబంధించిన కథ ఇది అని తెలిపారు. సాయి పల్లవి అప్పటికీ ఇప్పటికీ ఒక గొప్ప నటి అని తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి