ఇటీవల కన్నడలో తెరకెక్కి పాన్ ఇండియా మూవీస్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కెజిఎఫ్ చాప్టర్ సిరీస్ లోని రెండు సినిమాలు కూడా ఒక దానిని మించేలా మరొకటి ఎంతో అద్భుత విజయాలు సొంతం చేసుకున్నాయి మనకు అందరికీ తెలిసిందే. ప్రశాంత్ నీల్ తీసిన ఈ ప్రతిష్టాత్మక మూవీస్ లో హీరోగా రాకింగ్ స్టార్ యాష్ నటించగా హోంబలె ఫిలిమ్స్ వారు వీటిని ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ. 1200 కోట్ల పైచిలుకు కలెక్షన్ ని సొంతం చేసుకుని సరికొత్త రికార్డు నెలకొల్పింది.
అయితే ఈ మూవీ తరువాత ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ అనే భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న సలార్ ని కూడా హోంబలె సంస్థ వారే నిర్మిస్తున్నారు. కాగా సలార్ పై అందరిలో భారీ అంచనాలు ఉంన్నాయి. అయితే దీని తరువాత ఎన్టీఆర్ తో తన నెక్స్ట్ మూవీ చేయనున్నారు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ కెరీర్ 31వ మూవీగా రూపొందనున్న ఈ మూవీ పై కూడా భారీ అంచనాలు ఉండడంతో పాటు ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కి బాగా ఆదరణ లభించి, అంచనాలు విపరీతంగా పెంచేసింది.
అయితే అస్లు విషయం ఏమిటంటే, ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఖాతాలో ఉన్న ఈ రెండు సినిమాల్లో ఏది ఎంత మేర విజయం సాధిస్తుంది అనేటువంటి ఆసక్తి అటు ఎన్టీఆర్, ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా విపరీతంగా ఉంది. ఒకరకంగా కెరీర్ పరంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కి ఇది పెద్ద అగ్ని పరీక్షే అంటున్నాయి సినిమా వర్గాలు. అయితే ఈ రెండు సినిమాల యొక్క కథలు వేటికవే అదిరిపోయాయని, తప్పకుండా ఇవి రెండు రేపు తెరకెక్కి, ఆపైన విడుదల తరువాత పెద్ద సక్సెస్ లు అందుకోవడం ఖాయం అని ప్రశాంత్ నీల్ టీమ్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. మరి ఈ రెండు భారీ మూవీస్ ని ప్రశాంత్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తారో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: