తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇతర భాషల నుండి వచ్చిన ముద్దుగుమ్మలు వరుస అవకాశాలు దక్కించుకోవడం, స్టార్ హీరోయిన్ లుగా చాలా సంవత్సరాల పాటు కొనసాగడం అనేది చాలా సంవత్సరాలుగా జరుగుతున్న విషయమే. అయితే ప్రస్తుతం కూడా కన్నడ నుండి వచ్చిన కొంత మంది హీరోయిన్ లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అలా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలను దక్కించుకుంటున్న కన్నడ ముద్దుగుమ్మలు ఎవరో తెలుసుకుందాం.

పూజా హెగ్డే : కన్నడ ముద్దు గుమ్మ పూజా హెగ్డే గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనగణమన సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మహేష్ బాబు,  త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో కూడా హీరోయిన్ గా నటించబోతోంది.


రష్మిక మందన : కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. రష్మిక మందన మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోయే పుష్ప పార్ట్ 2 మూవీ లో నటించబోతోంది.


కృతి శెట్టి : ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో ది వారియర్ , ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు నాగ చైతన్య వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: