టాలీవుడ్ సినిమా పరిశ్రమలో భారీ స్థాయిలో క్రేజ్ కలిగిన హీరోల జాబితాలో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు అనడానికి మరొక నిదర్శనం గత కొన్ని రోజులుగా ఆయన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతు ఉండడం. వాస్తవానికి ఏ హీరో అయినా ఆయన సినిమా విడుదల ఉంటేనో, అప్డేట్ ఉంటేనో సోషల్ మీడియాలో అభిమానులు ట్రెండ్ చేస్తూ ఉంటారు.  కానీ విజయ్ దేవరకొండ విడుదలకు అప్డేట్ లకు అతీతంగా ప్రతి రోజు ట్రెండ్ అవుతూ ఉండటం ఆయనకు ఉన్న క్రేజ్ ను తెలియపరుస్తుంది.  

అర్జున్ రెడ్డి సినిమా తో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయిన ఆయన గీత గోవిందం డియర్ కామ్రేడ్ టాక్సీవాలా వంటి చిత్రాలతో తన స్టార్డమ్ ను నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా పరిచయం కాబోతున్నాడు. ఆగస్టు 25వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. కొన్ని రోజులుగా ఈ సినిమా యొక్క అప్డేట్ గురించి చిత్ర నిర్మాణ సంస్థ అయిన పూరీ కనేక్ట్స్ ను అడుగుతున్నారు సోషల్ మీడియా వేదికగా అభిమానులు. 

విడుదల తేదీ దగ్గర పడుతున్న కూడా ఈ సినిమా యొక్క అప్డేట్ ఇవ్వకపోవడంపై వారు అసంతృప్తిగా ఉన్నారు. జూలై 1వ తేదీ నుంచి ఈ సినిమా యొక్క అప్డేట్లు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడిస్తుంది. ఇకపోతే తాజాగా ఆయన ఒక స్పోర్ట్స్ కార్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం కూడా నెట్టింట హల్చల్ చేస్తుంది. దానికి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు నెట్ లో వైరల్ అయిపోయింది. ఆ ఫోటో తో విజయ్ దేవరకొండ క్రేజ్ మరింత పెరిగిపోయింది అని చెప్పాలి. తెలుగు సినిమా పరిశ్రమలో ఓ హీరో స్పోర్ట్స్ కార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం జరిగింది తొలిసారి కాబోలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: