హీరోయిన్లుగా ఏం చేసిన కూడా అది రచ్చరచ్చ అవుతుంది..అందుకే చాలా మంది విదెసాల్లొ ట్రిప్ లు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు..ఇక్కడ వాళ్ళకు అంత ప్రైవసి లేదనే చెప్పాలి..అయితే ఇప్పుడు మరో హీరోయిన్ రోడ్డు పై చిందులేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించింది.. విషయానికొస్తే..కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళ్, పంజాబీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది..


ఇటీవలే హనీ ఈజ్ రిచ్ అంటూ f3 సినిమాతో ప్రేక్షకులని అలరించింది. ఇక మెహ్రీన్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. వరుసగా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకి ఎప్పుడూ టచ్ లో ఉంటుంది.కాగా మెహర్రీన్ ఒక డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది..ఆ వీడియో కాస్త వైరల్ అవుతుంది.డ్యాన్స్ వీడియోలో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా? ఆ డ్యాన్స్ నడి రోడ్డు మీద చేసింది. ఇటీవల తన బంధువుల పెళ్లి వేడుకల్లో పాల్గోంది హీరోయిన్‌ మెహ్రీన్. ఈ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో నిర్వహించిన ఊరేగింపులో భాగంగా నడిరోడ్డుపై స్టెప్పులేసింది. మరో అమ్మాయితో కలిసి తీన్‌మార్ స్టెప్పులేసింది మెహ్రీన్..


ఆ పెళ్ళి ఊరేగింపు లో చేసిన డ్యాన్స్ వీడియో మెహ్రీన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది... పంజాబీ వెడ్డింగ్‌ సీన్స్‌' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మెహ్రీన్ ఇలాంటి వీడియో పెట్టడం తో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మెహ్రీన్ డ్యాన్స్ చుసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు... మొత్తానికి ఆ వీడియో కూడా వైరల్ అయ్యింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల విడుదల అయిన ఎఫ్3 మూవీ ఓ మాదిరిగా హిట్ అయ్యింది. ప్రస్తుతం చేతిలో ఎటువంటి అవకాశాలు లేవని తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా నెట్టింట హల్ చల్ చేస్తుంది...మీరు ఓ పారి చూడండి..


మరింత సమాచారం తెలుసుకోండి: