లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ అనే యాక్షన్ ఓరియంటెడ్ మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అనేక అంచనాల నడుమ జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన విక్రమ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్ లను అందుకుంటుంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్ లనే రాబడుతోంది. విక్రమ్ సినిమా విడుదలకు ముందు నుండే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను కలగజేయడంతో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అందులో భాగంగా విక్రమ్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 7 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. దానితో విక్రమ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.50 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలో దిగింది. ఇలా 7.50 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన విక్రమ్ సినిమా 26 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో 16.86 కోట్ల షేర్ , 29.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. దీంతో 26 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి విక్రమ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో  9.36 కోట్ల ప్రాఫిట్ ను అందుకొని బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది.

ఇప్పటికి కూడా విక్రమ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనే రేంజ్ కలెక్షన్ లను రాబడుతోంది. విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ముఖ్య పాత్రలో నటించగా సూర్య గెస్ట్ రోల్ లో నటించాడు. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: