టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మాస్ ఇమేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయిన గోపిచంద్ 'సిటిమర్' లాంటి కమర్షియల్ విజయం తర్వాత పక్కా కమర్షియల్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పక్కా కమర్షియల్ మూవీ లో రాశి ఖన్నా గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించగా , మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రావు రమేష్ , సత్యరాజ్ కీలక పాత్రలో నటించగా, యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మించారు.

మొదటి నుండి ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా జులై 2 వ తేదీన విడుదల అయ్యింది. మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మొదటి షో కే బాక్సాఫీస్ దగ్గర మిక్సీడ్  టాక్ లభించింది. మిక్సీడ్ టాక్ లభించినప్పటికీ మొదటి మూడు రోజులు ఈ సినిమాకు మంచి కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు అయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా పక్కా కమర్షియల్ మూవీ మొదటి రోజు 3.07 కోట్ల షేర్ , 5.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
 ప్రపంచవ్యాప్తంగా పక్కా కమర్షియల్ మూవీ రెండవ రోజు 1.83  కోట్ల షేర్ , 3.10  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది
 ప్రపంచవ్యాప్తంగా పక్కా కమర్షియల్ మూవీ మూడవ రోజు 1.57 కోట్ల షేర్ , 2.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా మూడు రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా డీసెంట్ కలెక్షన్లను వసూలు చేసిన పక్కా కమర్షియల్ మూవీ 4 వ రోజు 0.62 కోట్ల షేర్ , 1.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇలా మొదటి వీక్ డే అయిన సోమవారం రోజు పక్కా కమర్షియల్ సినిమా కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర పడిపోయాయి. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: