బాలీవుడ్లో స్టార్ కపుల్ గా పేరుపొందిన కత్రినా కైఫ్ ,విక్కీ కౌశల్ పై నిన్నటి రోజున వీరిద్దరిని చంపేస్తామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చాయి. అలా చేసింది మన్విందర్ అని యువకుడు.. ప్రతిసారి తన ఇంస్టాగ్రామ్ లో తమను బెదిరిస్తున్నాడని కంప్లైంట్ చేయడం జరిగింది విక్కీ, కత్రినా కైఫ్. మన్విందర్ కత్రినాను వెంటపడుతున్నాడని ఈ విషయంపై..506-2,354-D కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి శాంతా క్లాస్ పోలీసులు విచారణ చేపట్టారు. అయితే కత్రినా కైఫ్ తన భర్త విక్కీ కౌశల్ నాలుగేళ్లుగా ప్రేమించుకుని గత ఏడాది ఒకటైన విషయం అందరికీ తెలిసిందే.



ప్రస్తుతం ఎవరి సినిమాలలో వారు బిజీగా ఉన్నారు కత్రినా సల్మాన్ ఖాన్ టైగర్ స్త్రీల యాక్ట్ చేస్తూ ఉండగా విక్కీ గోవిందా నామ్ మేరా వంటి తదితర సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఒకటి రెండు సార్లు కాకుండా పదేపదే అతని లాంటి పోస్టులను సోషల్ మీడియాలో చేయడంతో ఆలెర్ట్ అయ్యారు కత్రినా తన భర్త. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేయగా అతని వివరాలను రాబట్టిన పోలీసులు అతడిని ఎట్టకేలకు అరెస్టు చేయడం జరిగింది. ఇక అతడు ఇంస్టాగ్రామ్ చూసిన పోలీసులు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది.కత్రినా ని చంపుతానని బెదిరిస్తున్న ఇతడు ఆమెతో పెళ్లి అయినటువంటి వీడియోలను ఎడిట్ చేసి పోస్ట్ చేయడం జరిగింది. ఇంతకీ ఎవరి మన్విందర్ అని ఆరా తీయగా.. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం ఇతడు సినీ రంగంలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లుగా గుర్తించారు.. అయితే మన్విన్ధరుకు కత్రినా అంటే చాలా ఇష్టమని ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడట అయితే గత ఏడాది కత్రినా వికీతో కలిసి పెళ్లి చేసుకోవడంతో అతని ఆశలు అడియాసయ్యాయని తెలియజేశారట. దీంతో కత్రినాను చంపేస్తానని బెదిరిస్తున్న అతని పై ఐటి యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో కత్రినా విక్కీ దంపతులు కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: