బాలీవుడ్లో ఒక సాదాసీదా యువహీరో స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగాడు రణవీర్ సింగ్. ప్రస్తుతం బాలీవుడ్లో ఎంతో మంది హీరోలు ఉన్న రణవీర్ సింగ్ కి మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అని చెప్పాలి. ఈ హీరో నటించిన సినిమాలు దాదాపు సూపర్ హిట్ కొట్టాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా అమ్మాయిల్లో అయితే రణవీర్ సింగ్ కి ఉన్నా ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ యంగ్ హీరో గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.


 దీంతో రణవీర్ సింగ్ తో సినిమా అంటే ప్రేక్షకులకు నచ్చకపోయినా మినిమం  వసూళ్లు ఉంటాయని నిర్మాతలు కూడా నమ్ముతూ  ఉంటారూ అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇటీవలే రణవీర్ సింగ్  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు  కారణం సోషల్ మీడియా వేదికగా న్యూడ్ ఫోటోలను పోస్ట్ చేయడమే. ఒంటి మీద నూలు పోగు లేకుండా రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోలకి ఫోజులు ఇవ్వడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. మ్యాగజైన్ కవర్ పేజీ కోసం రణవీర్ సింగ్ ఇలా న్యూడ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇక ఈ స్టార్ హీరో  సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన న్యూడ్ ఫోటోలు కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాదు భారతీయ చలన చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిపోయాయ్. ఇప్పుడు ఈ న్యూడ్ ఫోటోలకు సంబంధించి మరో వార్త వైరల్ గా మారిపోయింది. సాధారణంగా ఒక్కో సినిమాకి రణవీర్ సింగ్  45 నుంచి 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడట. ఇక న్యూడ్ ఫోటో షూట్ కోసం కూడా రణవీర్ సింగ్  ఇదే మొత్తంలో పారితోషికం అందుకున్నాడట. ఇక కేవలం ఫోటోషూట్ కోసం రణవీర్ ఏకంగా 50 కోట్లు తీసుకున్నాడు అని తెలియడంతో ప్రతి ఒక్కరు షాక్ లో మునిగిపోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: