నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసార అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు మల్లాడి వశిష్ట్ దర్శకత్వం వహించగా , ఈ సినిమాలో క్యాథరిన్ , సంయుక్త మేన హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ ని ఆగస్ట్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది.

ఈ ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉండటంతో , ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే బింబిసార మూవీ యూనిట్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాను ఫుల్ గా ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగా బింబిసార మూవీ లో హీరోగా నటించిన కళ్యాణ్ రామ్ కూడా వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్నాడు. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్సినిమా గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు

 తాజా ఇంటర్వ్యూలో భాగంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ... ఈ మూవీ కి మల్లాడి వశిష్ట్ అందించిన కథ ప్రధాన హైలెట్ అని , ఇటువంటి కథ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను అని, అటువంటి కథనే మల్లడి వశిష్ట్ చెప్పాడు అని,  అయితే ఆ తర్వాత పూర్తి కథ విషయమై ఈ కథలో కొన్ని మార్పులు ... చేర్పులు చేసినట్లుగా కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు. అలాగే ఈ మూవీ ని దర్శకుడు మల్లాడి వశిష్ట్ తెరకెక్కించిన విధానం కూడా సూపర్ గా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనే నమ్మకాన్ని కూడా కళ్యాణ్ రామ్ వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: