ఆ సినిమా పేరు ది లెజెండ్. ప్రముఖ వ్యాపారవేత్త అరుల్ శరవణన్ 51 ఏళ్ల వయసులో హీరోగా ఈ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు అనే విషయం తెలిసిందే. ఇప్పుడు వరకు మోడల్గా వ్యాపారవేత్తగా మాత్రమే ప్రేక్షకులకు పరిచయమైన శరవణన్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఇందులో తప్పేముంది.. టాలెంట్ ఉంటే ఎవరైనా సరే హీరోగా రాణించవచ్చు అని అంటారు ఎవరైనా.. అయితే ఇప్పటికే అతని వయసు, లుక్స్ టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టారు నెటిజన్లు. ఇలాంటి ట్రోలింగ్ చేయడమే ఈ సినిమాకు కలిసి వచ్చింది. దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది.
అయితే సినిమా థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు అనే చెప్పాలి. ముఖ్యంగా శరవణన్ నటించిన ఎమోషనల్ సన్నివేశాలలో పగలబడి నవ్వుతూ ఉండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. శరవనన్ ను కొంతమంది సంపూర్ణేష్ బాబు లా చూసినట్లుగా చూస్తూ ఉండటం గమనార్హం. ఈ సినిమాను శరవనన్ తన సొంత డబ్బుతో నిర్మించుకున్నారు. ఈ సమయంలో ఇతనికి సపోర్ట్ గా నిలుస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది అని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఒక లుక్కేయండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి