'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాతో తారక్‌ పాన్ ఇండియా హిట్ కొట్టి పెద్ద పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. తరువాత 30 వ సినిమా కొరటాల శివ సినిమాగా కన్ఫర్మ్ చేసుకున్నాడు. అయితే కొరటాల శివ తీసిన 'ఆచార్య' సినిమా ఫట్‌ మనడడంతో కథ విషయంలో తారక్‌ ఇక రెండోసారి ఆలోచించాల్సి వచ్చిందట. దీంతో బాగా చిక్కుల్లో పడ్డ కొరటాల ఎన్టీఆర్ ఈ కథలో మార్పులు అవసరం అనిపించి, అదే విషయంలో కొరటాలకు చెప్పారట. దీంతో ఇక కొరటాల శివ అండ్‌ కో గత కొన్ని రోజులుగా దాని మీదే తెగ కుస్తీ పడుతున్నారట. దీంతో సినిమా చాలా ఆలస్యం అవ్వొచ్చు అని వార్తలొచ్చాయి. ఇక ఈలోగా తారక్‌ పుట్టిన రోజు సంద్భంగా టీజర్‌ వీడియో ఇచ్చి సినిమా లైన్‌లోనే ఉంది అని చెప్పకనే చెప్పడం జరిగింది.ఇక ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే వేరేలా ఉంది అని అంటున్నారు. కొరటాల శివ కథ ఎన్ని సార్లు మార్చినా కూడా తారక్ అస్సలు సాటిస్ ఫై కాలేకపోతున్నాడట.


ఈ కథ ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం ఇంకా కాస్టింగ్‌ విషయంలో పరిస్థితులు అలాగే ఆలోచనలు మారడంతో వేరే సినిమా వైపు తారక్‌ మనసు మళ్లింది అని అంటున్నారు. అంటే కొరటాల శివకు ఇంకాస్త సమయం ఇచ్చి పవర్‌ ఫుల్‌ కథను సిద్ధం చేయమని కోరారట ఎన్టీఆర్. ఈలోపు విదేశీ పర్యటన ముగించుకుని వస్తా అని ఆయన వెళ్లారట. అయితే వచ్చాక తొలుత కొరటాల శివ సినిమానే మొదలవుతుందని చెప్పలేం అంటున్నారు తారక్ సన్నిహితులు.దీనికి కారణం బుచ్చిబాబు సానా ఎన్టీఆర్‌ కోసం సిద్ధం చేసుకున్న కథకు తుది మెరుగులు దిద్దుతున్నారని కూడా వార్తలొస్తున్నాయి. ఇంకా అలాగే తమిళ దర్శకుడు వెట్రిమారన్‌ కథను ఇటీవల తారక్‌ విన్నాడనే వార్తలు కూడా దీనికి అదనం. ఇక విదేశాల నుండి వచ్చాక దీనిపై క్లారిటీ ఇచ్చేస్తారని చెబుతున్నారు. చూద్దాం తారక్‌ సినిమాల రేసులో పాపం కొరటాల ఉంటాడో ఉండడో..?

మరింత సమాచారం తెలుసుకోండి: