ఇటీవల కాలంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విడుదలవుతున్న భారీ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద చతికిలబడడంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎంతో నిరాశ పడుతుంది. అక్కడ తప్పకుండా మంచి సినిమా వచ్చి భారీ విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆ బాధ్యత టాలీవుడ్ డైరెక్టర్ తీసుకున్నాడని అక్కడివారు చెబుతుండడం విశేషం. టాలీవుడ్ సినిమా పరిశ్రమలోని చాలా పాన్ ఇండియా సినిమాలు అక్కడ సత్తా చాటుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే వాటికి పోటీగా దిగి బాలీవుడ్ సినిమాలు వాటి ముందు పూర్తిగా తేలిపోతున్నాయి ఆ విధంగా ఇప్పుడు కొంతమంది టాలీవుడ్ దర్శకులు అక్కడ డైరెక్టర్ సినిమాలను చేస్తున్న క్రమంలో పూరి జగన్నాథ్ పైనే ఇప్పుడు బాలీవుడ్ పరువు ప్రతిష్టలు ఆధారపడి ఉన్నాయి. ఆయన దర్శకత్వం వహిస్తున్న లైగర్ సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో మొదటి నుంచి ఇది బాలీవుడ్ సినిమా నే అని చెబుతున్న నేపథ్యంలో ఈ చిత్రం విజయవంతం అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తుందా అనేది చూడాలి.

తెలుగు లో ఎన్నో సినిమాలు చేసి పెద్ద దర్శకుడు అయిన ఈ పూరీ ఇప్పుడు తన మకాం పూర్తిగా ముంబై కి మార్చేశాడు. అక్కడ వరుస సినిమాలు చేస్తున్నా డు. ఫ్యూచర్ లో కూడా అయన అక్కడే సినిమాలు చేస్తాడని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా అయన కు ఎలాంటి విజయాన్ని తెస్తాడో చూడాలి.  ఎంతోమంది పెద్ద పెద్ద దర్శకు లు పెద్ద పెద్ద హీరోలు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న వారు తమ సినిమా పరిశ్రమ యొక్క పరువును కాపాడలేకపోతున్నారు అలాంటిది టాలీవుడ్ దర్శకుడు అక్కడ సినిమా చేసి ఆ సినిమాతో బాలీవుడ్ ను ఆనందింప చేయడం సాధ్యమా అనేది చూడాలి. పూరీ జగన్నాధ్ కనుక ఈ సమస్య ను తీరిస్తే ఆయనకు బాలీవుడ్ బ్రహ్మరథం పట్టడం ఖాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: