పూరీజగన్నాథ్ మహేష్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘పోకిరి’ మూవీ ఒక ట్రెండ్ సెటర్ అప్పట్లో 100 సెంటర్లలో 100 రోజులు ఆడిన రికార్డ్ ఈమూవీ సొంతం ఈమూవీని ఇప్పటికీ టివి లలో ప్రసారం అవుతున్నప్పుడు ఈనాటి ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈమూవీని కొత్త ప్రింట్ తో ఈవారం మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు.


అయితే ఈమూవీకి వస్తున్న అనూహ్య స్పందన చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. బుక్ మై షోలో ‘పోకిరి’ బుకింగ్స్ చూసిన షాక్ అవుతున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే ఈసినిమాకు సంబంధించి ఇప్పటికే పాతిక షోలకు అడ్వాన్స్ బుకింగ్ లో టిక్కెట్లు అయిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాదు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో ఈసినిమాకు సంబంధించి 150 ప్రీమియర్ షోలు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.


తెలుస్తున్న సమాచారంమేరకు ‘పోకిరి’ మూవీ ప్రీమియర్ షోలకు సంబంధించిన టిక్కెట్ల  కోసం అభిమానుల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక అదనపు షోలు వేస్తున్నట్లు టాక్. వాస్తవానికి యూట్యూబ్ లో ఈసినిమాను ఫ్రీగా చూసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఈసినిమా రీ రిలీజ్ సందర్భంగా ధియేటర్లలో చూడాలి అన్న మ్యానియా ఏమిటి అంటూ ధియేటర్ల యజమానులు ఆశ్చర్యపోతున్నట్లు టాక్.


అంతేకాదు ఈ తరహాలో మహేష్ నటించిన ‘ఒక్కడు’ సినిమాను కూడ సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ షోలు వేస్తున్నట్లు టాక్. ఈ షోలకు దర్శకుడు గుణశేఖర్ ను కూడ ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయాలు ట్రెండింగ్ గా మారడంతో సెప్టెంబర్ లో వచ్చే పవన్ కళ్యాణ్ పుట్టినరోజునాడు పవన్ బ్లాక్ బష్టర్ మూవీ ‘జల్సా’ ‘ఖుషీ’ మూవీలను రీ రిలీజ్ చేసే ఉద్దేశ్యంలో కొంతమంది నిర్మాతలు ఉండడంతో ఆ విషయాన్ని కూడ ట్రెండింగ్ గా మార్చి పవర్ స్టార్ అభిమానులు తమ సత్తా చూపించడమే కాకుండా మహేష్ అభిమానులకు గట్టి సవాల్ విసరాలని ఇప్పటి నుంచే ఆలోచనలు చేస్తున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: