టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న హను రాఘవపూడి తాజాగా సీతా రామం అనే ప్రేమ కథా చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా మృణాళిని ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. రష్మిక మందన ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా , భూమిక చావ్లా , తరుణ్ భాస్కర్ , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , సుమంత్మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ ని ఆగస్ట్ 5 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ రావడంతో ఈ మూవీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లను వసూలు చేస్తోంది. ఇప్పటి వరకు ఆరు రోజుల బాక్సాపీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న సీతా రామం మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లను సాదించిందో తెలుసుకుందాం.

నైజాం : 4.06 కోట్లు , సీడెడ్ : 1.15 కోట్లు , యూ ఏ : 1.54 కోట్లు , ఈస్ట్ : 95 లక్షలు , వెస్ట్ : 62 లక్షలు , గుంటూర్ : 73 లక్షలు , కృష్ణ : 83 లక్షలు , నెల్లూర్ : 40 లక్షలు ,  ఆరు రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో సీతా రామం మూవీ 10.28 కోట్ల షేర్ , 18.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 1.05 కోట్లు .ఇతర భాషలలో : 2.85 కోట్లు .ఓవర్ సీస్ లో : 3.85 కోట్లు . ఆరు రోజులకు గాను సీతా రామం మూవీ ప్రపంచ వ్యాప్తంగా 18.03 కోట్ల షేర్ , 35.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: