సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ గా త్రివిక్రమ్ తో తన నెక్స్ట్ మూవీ చేయనున్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నో ఏళ్ళ క్రితం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు రెండూ కూడా ఎంతో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నాయి. అతడు సూపర్ హిట్ కొట్టగా ఖలేజా మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

ఇక ఈ రెండు సినిమాల తరువాత ఎంతో గ్యాప్ అనంతరం వస్తున్న ఈ మూవీ కావడంతో కేవలం మహేష్ బాబు ఫ్యాన్స్ లో మాత్రమే కాదు అటు ఆడియన్స్ అందరిలో కూడా ఈ మూవీపై ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతాన్ని, మది ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీ కి సంబంధించి కొద్దిరోజులుగా ఒక న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ మూవీలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ ఉంటుందని, అలానే అందుకోసం మహేష్ బాబు ఒక డిఫరెంట్ లుక్ లో కనిపంచనున్నారని అంటున్నారు. నిజానికి ఈ తరహా పీరియాడిక్ డ్రామా మూవీస్ గా గతంలో వచ్చిన మగధీర, బాహుబలి, గౌతమి పుత్ర శాతకర్ణి, బింబిసార మూవీస్ అన్ని కూడా మంచి సక్సెస్ అయ్యాయి. అలానే ఆయా దర్శకులు కూడా అటువంటి స్క్రిప్ట్స్ ని బాగా హ్యాండిల్ చేయడంతో అవి పెద్ద సక్సెస్ అందుకున్నాయి.ఒకవేళ ఇదే నిజం అయితే వామ్మో తొలిసారిగా ఈ తరహా జానర్ ని త్రివిక్రమ్ ఎలా హ్యాండిల్ చేస్తారో, సినిమాని ఎలా తీస్తారో ఏమో అంటూ కొందరు మహేష్ ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి పక్కాగా వచ్చే ఏడాది సమ్మర్ బరిలో నిల్పుతాం అంటూ ఇటీవల నిర్మాతలైన హారికా హాసిని క్రియేషన్స్ వారు అధికారికంగా ప్రకటించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: