పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు సినిమాలు చేస్తూ ఇటు మధ్యలో తన జనసేన పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఇటీవల రానా దగ్గుబాటితో ఆయన చేసిన భీమ్లా నాయక్ మూవీ మంచి సక్సెస్ కొట్టింది. సాగర్ కె చంద్ర తీసిన ఆ మూవీకి త్రివిక్రమ్ స్క్రిప్ట్ అందించారు. ఇక ప్రస్తుతం క్రిష్ తో పవన్ చేస్తున్న మూవీ హరిహర వీరమల్లు.

నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ పీరియాడిక్ డ్రామా మూవీని ఏ ఎం రత్నం నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ త్వరలో తదుపరి షెడ్యూల్ ని జరుపుకోనుంది. పవన్ ఇమేజ్ కి తగ్గట్లుగా అలానే తన మార్క్ టేకింగ్ ని ఎక్కడా కూడా మిస్ చేయకుండా తన గత సినిమాల మాదిరిగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి హరిహర వీరుమల్లు మూవీని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

అయితే మరోవైపు హరీష్ శంకర్ తో భవదీయడు భగత్ సింగ్, అలానే సముద్రఖనితో వినోదయ సిత్తం మూవీస్ ని కూడా త్వరలో ప్రారంభించనున్నారు పవన్ కళ్యాణ్. అయితే విషయం ఏమిటంటే, వీటిలో ఏ సినిమా నుండి కూడా ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ అప్ డేట్ లేకపోవడం, మరోవైపు పవన్ బర్త్ డే కూడా దగ్గర పడుతుండడంతో, అసలు ముందుగా పవన్ ఏ మూవీ చేస్తారో, ఏది రిలీజ్ అవుతుందో అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు పవన్ ఫ్యాన్స్. మరి వీటిపై క్లారిటీ రావాలి అంటే ఆయా సినిమాల యూనిట్స్ స్వయంగా స్పందించాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు. మరోవైపు చాలా గ్యాప్ తరువాత తనకు ఇష్టమైన పవన్ తో మూవీ చేస్తుండడంతో నిర్మాత ఏ ఎం రత్నం, హరిహర వీరమల్లు విషయమై అన్నివిధగలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నిర్మాణం విషయమై ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావడం లేదట. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: