ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి విజయాన్ని తెచ్చిపెట్టినా కూడా ఆ విజయాన్ని ఉపయోగించుకోలేక పోతున్నాడు హీరో రామ్ పోతినేని. ఆ చిత్రం తర్వాత చేసిన రెడ్ సినిమా పర్వాలేదనిపించుకుంది. కాన్సెప్ట్ బాగానే ఉన్నా కూడా ఎందుకో తెలుగు ప్రేక్షకులకు ఆ సినిమా పెద్దగా ఎక్కలేదు. దాంతో ఈసారి చేయబో యే సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని చెప్పి ఆయన లింగస్వామి తో చేతులు కలిపి ఈ వారియర్ అనే ఒక సినిమాను చేశాడు. మాస్ మాసాలా చిత్రంగా మాస్ ప్రేక్షకులను ఎక్కువగా టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది.

దాంతో మరొక ఫ్లాప్ ను ఆయన ఎదుర్కొన్నట్లు అయింది. ఎన్నో అంచనాలను పెట్టుకున్న సినిమాలు ఈ విధంగా బాక్సాఫీస్ వద్ద చతికల పడటంతో ఆయన అభిమానులు కొంత కలవర పడుతున్నారు. దాంతో ఇప్పుడు చేస్తున్న బోయపాటి శీను సినిమాపై ఎంతగానో క్రేజ్ ఏర్పడింది. బోయపాటి శ్రీను సినిమాలకు పెద్దగా గ్యారెంటీ ఇవ్వలేము ఎందుకంటే ఆయన సినిమాలు భారీ స్థాయిలో ఉంటాయి కాబట్టి
కొన్నిసార్లు భారీ అపజయాలను అందుకుంటాయి.

 ఈ నేపథ్యంలో రామ్ ఆయనతో కలిసి ఏ విధమైన సినిమా చేస్తాడు అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమా యొక్క షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుంది అఖండ లాంటి భారీ విజయాన్ని అందుకున్న బోయపాటి శ్రీను ఆ చిత్రం తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా కూడా ఆ స్థాయిలోనే తెరకెక్కి భారీ విజయాన్ని తెచ్చిపెడుతుంది అని వారు భావిస్తున్నారు. మరి ఈ సినిమా రామ్ కు ఎలాంటి విజయాన్ని తెచ్చిపెట్టి ఆయన కెరీర్ ను కాపాడుతుందో చూడాలి. ఆ తర్వాత కూడా ఆయన తన తదుపరి సినిమాలను తమిళ దర్శకులతో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: