ఒక సినిమా చేయడం ఎంత ముఖ్యమో ఈ రోజులలో ఒక సినిమాను ప్రమోట్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఎంతటి పెద్ద హీరో సినిమా నైనా థియేటర్లలో చూడడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు మన ప్రేక్షకులు. ఇక చిన్న సినిమాల సంగతి సరే సరి. బాగుంటేనే ఓ టీ టీ లలో సినిమాలు చూస్తున్న ఈ రోజుల్లో సినిమా ఎంతో బాగుంటే గాని థియేటర్లకు వెళ్లి చూడటం లేదు. ఆ విధంగా ప్రమోషన్ చేయడంలో కొత్త రకం చూపిస్తేనే కానీ ప్రేక్షకులు ఏ సినిమా నైనా థియేటర్లలో ఆదరించడం లేదు.

అలా మన హీరోలు ఈ విషయంలో చాలావరకు విఫలం అవుతున్నారనే చెప్పాలి. తమ సినిమాను ప్రమోషన్ చేసే విషయంలో కొత్తదనం ఉండాలని కొంతమంది సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. అలా విజయ్ దేవరకొండ తన సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా నిర్వహించడం ఇతర హీరోలు ఆయనను చూసి నేర్చుకోవాలన్న ఆలోచనను క్రియేట్ చేస్తుంది. ఆయన హీరోగా నటిస్తున్న లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. 

ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ఎంతో జోరుగా చేస్తున్న విజయ్ దేవరకొండ తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా సినిమా ప్రేక్షకులందరికీ ఆనందాన్ని ఇస్తున్నాడు. నిర్మాతకు మంచి కలెక్షన్లు రావాలని ఆయన ఎంతో కష్టపడుతున్నారు. కొన్ని ఈవెంట్లలో ఆయన ఎంత సిక్ అయి ఉన్నారో స్క్రీన్ మీదనే తెలుస్తుంది. అయినా కూడా మా కోసం తన అభిమానుల కోసం కార్యక్రమంలో పాల్గొని వారిలో ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తున్నారు. ఈ రోజులలో ఈ విధంగా చేసే హీరో ఎవరూ ఉండరని చెప్పాలి. సినిమా కోసం ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా పనిచేసే చాలా తక్కువ మంది హీరోలలో ముందు వరుసలో ఉంటారు విజయ్ దేవరకొండ. మరి ఆయన కష్టానికి ప్రతిఫలంగా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకొని మంచి కలెక్షన్లను సాధిస్తుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: