టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటిగా ప్రేక్షకులను సందడి చేసిన అనుపమ పరమేశ్వరన్ ఒకానొక సమయంలో అవకాశాలు లేకుండా నే ఇండస్ట్రీకి దూరమయ్యారు.


వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె నిఖిల్ సరసన నటించిన కార్తికేయ 2 సినిమా విడుదలయ్యి ఎంతో మంచి విజయాన్ని కూడా అందుకుంది. ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి ఆదరణ సంపాదించుకుంది.


ఇకపోతే ఈ సినిమా విడుదలైన మూడు రోజులకే బ్రేక్ ఈవెంట్ సాధించి విజయం సాధించడంతో చిత్రబృందం సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారట.ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకొని అందరూ సంతోషంలో ఉండగా ఈమె మాత్రం నాకు చాలా బాధగా ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారని తెలుస్తుంది.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సినిమా ఇంత మంచి విజయం అందుకోవడంతో ఒకవైపు సంతోషంగా ఉన్నప్పటికీ మరోవైపు చాలా బాధగా ఉందని


 


అప్పుడే ఈ సినిమాతో నాకు రుణం తీరిపోయిందా అనే బాధ తనని ఎంతగానో కలిచి వేస్తుంది అంటూ ఈ సందర్భంగా ఈమె కార్తికేయ 2 సినిమా గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా అనుపమ పరమేశ్వరన్ చాలా బాధగా ఉందంటూ చేసిన కామెంట్లపై నేటిజన్స్ స్పందిస్తూ ఇది కాస్త ఓవర్ గా ఉన్నట్టు లేదు అంటూ వారి నోటికి పని చెబుతున్నారట.


 


మొత్తానికి ఈ ముద్దుగుమ్మ మాట్లాడిన ఈ మాటల వల్ల నెటిజన్ల ట్రోలింగ్ కి గురవుతున్నారని చెప్పాలి.ఇక ఈ సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ దిల్ రాజు పాల్గొని చిత్ర బృందానికి అభినందనలను తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: