సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరి కొద్ది రోజుల్లో ఒక సినిమా ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ఆగస్టు నెలలో ప్రారంభించ బోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది . కాక పోతే కొన్ని అని వార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నెలలో ప్రారంభం కాలేదు .

మూవీ రెగ్యులర్ షూటింగ్ ని సెప్టెంబర్ రెండవ వారం నుండి ప్రారంభించే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది . అలాగే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బంధం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది . ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ సినిమాగా  తెరకెక్కబోతుంది . ఈ మూవీ లో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించానుండగ ,  సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందించ బోతున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ క్రేజీ మూవీ లో తరుణ్ ఒక ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు  , ఆ పాత్ర మూవీ కే హైలైట్ గా నిలవనున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే తరుణ్మూవీ లో నటించబోతున్నాడు అనే వార్త పూర్తిగా అవాస్తవం అని తెలుస్తుంది. మహేష్ బాబు ,  త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఇది వరకే రెండు సినిమాలు తెరకెక్కాయి. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమా కావడంతో ఈ సినిమాపై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: