కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు కన్నడం ఇతర భాషల్లో కూడా ది లెజెండ్ సినిమా విడుదలైంది.
దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో
రూపొందిన ఈ సినిమాను మరో ఐదు కోట్లు ఖర్చు చేసి భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాల ను నిర్వహించారు. సినిమా విడుదల తర్వాత ప్రమోషన్ కోసం ఖర్చు చేసిన ఆ ఐదు కోట్ల రూపాయల కూడా వెనక్కు వచ్చిన దాఖలాలు కనిపించలేదు.
సాధారణంగా అయితే ఈ స్థాయి లో ఫ్లాప్ తర్వాత ఏ హీరోతో కూడా నిర్మాత సినిమా తీసేందుకు ముందుకు రాడు.. కానీ ఆయనే నిర్మాత అవడం వల్ల మరో సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.
వయస్సు పై పడిన ఈ హీరో రెండవ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. అతి త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకి నష్టం భారీగా జరిగిన తమ వ్యాపారాలకు మాత్రం మంచి చేస్తుంది అనే ఉద్దేశంతో మరో సారి హీరో రెండో సినిమా తో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేయబోతున్నాడు.
సినిమాకు వచ్చే వసూళ్లని కాకుండా వస్తున్న పేరుని పరిగణలోకి తీసుకొని సినిమాలను చేయాలని ఉద్దేశంతో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. అతి త్వరలోనే ఆయన రెండవ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందంటూ చిత్ర సభ్యులు మరియు తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
కోలీవుడ్ వర్గాల ప్రకారం.. త్వరలోనే ఆయన కొత్త సినిమా అప్డేట్ ఇవ్వనున్నారని, ఈ సారి ఏకంగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించనున్నారని తెలిసింది. ఇప్పటికే ఓ కొత్త దర్శకుడితో చర్చలు జరిపి, కథను ఫైనల్ చేశారట. త్వరలోనే గ్రాండ్‌గా అనౌన్స్ చేయబోతున్నారని సమాచారం. అన్నట్లు.. ఇది కూడా పాన్ ఇండియా చిత్రమేనట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి