కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న అజిత్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అజిత్ తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా డబ్ చేసి విడుదల చేశాడు. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించాయి. దానితో అజిత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అజిత్ హెచ్ . వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన వలిమై అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కింది. ఈ మూవీ లో టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన కార్తికేయ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. 

మంచి అంచనాల నడుమ విడుదల అయిన వలిమై మూవీ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని సాధించింది. ఇది ఇలా ఉంటే వలిమై మూవీ కి దర్శకత్వం వహించిన హెచ్ . వినోద్ దర్శకత్వంలో అజిత్ ప్రస్తుతం మరో మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్త బృందం విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి చిత్ర బృందం తునివు అనే టైటిల్ ని ఫిక్స్ చేసింది. అలాగే ఈ మూవీ యూనిట్ నిన్న విడుదల చేసిన అజిత్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయ్యింది.  ఈ మూవీ నుండి అజిత్ కు సంబంధించిన మరో పోస్టర్ ని కూడా చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో అజిత్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో  స్పెడ్స్ పెట్టుకొని ఉన్నాడు. ఈ పోస్టర్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: