యువ సామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య 'లవ్‌స్టోరీ', 'బంగార్రాజు' వంటి వరుస హిట్లతో టైర్‌-2 హీరోలలో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు…

అయితే ఇటీవ లే వచ్చిన 'థాంక్యూ' చిత్రం ప్రేక్షకుల ను కాస్త నిరాశపరిచింది. ప్రస్తుతం ఈయన 'మానాడు' ఫేం వెంకట్‌ ప్రభు దర్శకత్వం లో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాను చేస్తున్నాడు.
యువ సామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి వరుస హిట్లతో టైర్‌-2 హీరోలలో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. అయితే ఇటీవలే వచ్చిన ‘థాంక్యూ’ చిత్రం ప్రేక్షకులను కాస్త నిరాశపరిచింది. ప్రస్తుతం ఈయన ‘మానాడు’ ఫేం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాను చేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్‌ పోస్టర్‌ విడుదల కాగా.. దీనికి ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా చిత్రబృందం ఈ మూవీ సినిమాటోగ్రాఫర్‌ను ప్రకటించింది.

ఈ చిత్రాని కి ‘జైభీమ్‌’, ‘కతు వాకుల రెండు కాదల్‌’ వంటి సినిమాలకు పనిచేసిన ఎస్‌.ఆర్‌ కతీర్‌ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఇక ఈ చిత్రంbలో నాగచైతన్య పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించ నున్నాడు. ద్విభాషా చిత్రంగా తెర కెక్కుతున్న ఈ మూవీ లో కృతిశెట్టి హీరోయిన్‌ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థం లో సినిమా ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

ప్రస్తుతం నాగచైతన్య నటించిన ‘ధూత’ వెబ్‌సిరీస్‌ విడుదల కు సిద్ధంగా ఉంది. సూపర్‌ నాచ్యురల్ పవర్స్ నేపథ్యం లో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ను నార్త్ స్టార్ ఎంటర్టైనమెంట్స్‌ తో కలిసి అమేజాన్ ఒరిజినల్స్ నిర్మిస్తుంది. ఈ వెబ్‌సీరీస్‌లో మలయాళ భామ పార్వతి, ప్రియాభవాని శంకర్, ప్రచి దేశాయ్, తరుణ్ భాస్కర్‌ కీలక పాత్రల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: