మొదట చిన్న సినిమాగా విడుదలై ఆ తర్వాత మంచి గుర్తింపు తెచ్చుకున్న సినిమాలలో డీజే టిల్లు సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు. ఇందులో హీరోగా సిద్దు జొన్నలగడ్డ నటించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది .ఈ సినిమా కూడా కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కించడం జరిగింది. ఇందులో హీరోయిన్ నేహా శెట్టి నటించింది. ఈ ముద్దుగుమ్మ అందచందాలు సిద్దు టైమింగ్ డైలాగులు ఈ సినిమాను ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా చేశాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో నిలిచింది.


అయితే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ప్రకటించడంతో ఈ సినిమాపై చాలా ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమా సీక్వెల్ కు అన్ని సిద్ధం చేసుకున్నప్పటికీ అయితే ఈ సినిమా హీరోయిన్ ని చేంజ్ చేయాలని చిత్ర బృందం భావించినట్లు తెలుస్తోంది. అందుకోసం మొదట డిజే టిల్లు సినిమాలో నటించిన నేహా శెట్టికి బదులుగా మరొక హీరోయిన్ శ్రీలీలను ఎంపిక చేసినట్లుగా వార్తలు వినిపించాయి. పెళ్లి సందడి సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన  ఈ ముద్దుగుమ్మ తన అందాచందాలతో.. ఎనర్జీటిక్ పర్ఫామెన్స్ తో బాగానే ఆకట్టుకుంది.అయితే ప్రస్తుతం ఈ అమ్మడు పలు ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నది. రవితేజతో ధమాకా సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు తాజాగా డిజే టిల్లు టీమ్ కు శ్రీలీలా గట్టు షాక్ ఇచ్చిందన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్న ఇప్పుడు ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఏంటో తెలియదు కానీ.. కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత శ్రీలీలా సినిమా నుంచి వైదొలిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతటి నిజం ఉందో తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: