ఆయన ఆరడుగుల అందగాడు.. అమ్మాయిల కలల రాకుమారుడు.. యువతుల మనసులు కొల్లగొట్టిన గ్రీకు వీరుడు.. ఆయన వయసు పెరుగుతుంది తప్ప అందం మాత్రం తరగడం లేదు. ఇక రోజు రోజుకి యువకుడిగా మారుతున్నాడు తప్ప వయస్సు మీద పడుతున్నట్లు కనిపించడం లేదు. ఇప్పటికీ ఆయన పేరు వినిపించింది అంటే చాలు అమ్మాయిల్లో ఏదో తెలియని వైబ్రేషన్స్.  ఆ హీరో ఎవరో కాదు మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తన స్టైల్ తో తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం 40 ఏళ్ల వయసు దాటిపోతున్న మహేష్ బాబు అందం మాత్రం ఇంకా తగ్గలేదు అని చెప్పాలి. ఇంకా పాతికేల్లా కుర్రాడు లాగానే కనిపిస్తూ ఉంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.


 ఇక మహేష్ బాబును చూసినప్పుడు ఈయనకి అసలు మేకప్ అవసరం లేదేమో కాస్త టచ్ అప్ చేస్తే సరిపోతుంది అని అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. మేకప్ ఉన్న లేకపోయిన కూడా మహేష్ బాబు ఎంతో అందంగా రాకుమారుడులా కనిపిస్తూ ఉంటారు   అయితే ఇప్పుడు వరకు మహేష్ బాబు అన్ని సినిమాల్లో కూడా పాత్రకు తగ్గట్టుగా మేకప్ వేసుకొని నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కానీ మహేష్ బాబు కెరియర్ లో మేకప్ జోలికి పోకుండా నటించిన సినిమా ఒకటి ఉందట. అదే తేజ డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిజం సినిమా.


 ఈ సినిమా కోసం మహేష్ బాబు కాస్తయినా మేకప్ వేసుకోలేదట.  నేచురల్ లక్స్ తో ఫేస్ వాష్ చేసుకుని షూటింగ్స్ లో పాల్గొంటూ ఉండేవాడట మహేష్ బాబు. కాగా ఈ సినిమాలోని కథ ప్రేక్షకులకు నచ్చినప్పటికీ స్క్రీన్ ప్లే మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయితే మహేష్ బాబును ఏమీ తెలియని అమాయకుడిలా అమ్మ చాటు బిడ్డల అంగీకరించలేకపోయారు ప్రేక్షకులు. చివరికి ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది. ఈ సినిమాలో మాత్రం మహేష్ బాబు నటనకు మంచి మార్కులు పడ్డాయి అని చెప్పాలి. కాగా ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమాకు రెడీ అయిన మహేష్ బాబు త్వరలో రాజమౌళితో కూడా సినిమాకు అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: