టాలీవుడ్ లో స్టార్ కమెడియన్స్ లో ఒకడిగా పేరు తెచ్చుకన్నాడు ప్రభాస్ శ్రీను. ప్రభాస్ తో పాటు చాలా సినిమాల్లో నటించిన ఆయన ప్రభాస్ తోనే సినిమా జీవితం స్టార్ట్ చేశాడు.
యంగ్ రెబల్ స్టార్ కు డేట్స్ కూడా చూశాడు శ్రీను. ప్రభాస్ కు అన్నీ తానై చూసుకున్న ఆయన ఆతరువాత కాస్త దూరం అయ్యాడు. సినిమాల్లో బిజీ అయిపోవడంమో.. లేకు ఇద్దరి మధ్య ఏమైనా ఇష్యూస్ రావడమో తెలియదు కాని.. శ్రీను ప్రభాస్ కు దూరంగానే ఉంటున్నట్టు ఫిల్మ్ సర్కిల్ లో వార్తలు వినిపించాయి. ఇక తాజాగా కృష్ణం రాజు మరణం సమయంలో ప్రభాస్ తో పాటు కనిపించి హడావిడి చేశాడు శ్రీను.

చాలా కాలం తరువాత ప్రభాస్ తో ప్రభాస్ శ్రీను కనిపించడంతో మరోసారి వీరి గురించి టాపిక్ బయటకు వచ్చింది. ముందు నుంచి ప్రభాస్ తో ఆయనకి మంచి సాన్నిహిత్యం ఉంది. ఎక్కువగా విలన్ గ్యాంగ్ లో రౌడీగా కనిపిస్తూ వచ్చిన ప్రభాస్ శ్రీను ఆ తరువాత కమెడియన్ గా బిజీ అయ్యాడు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ప్రభాస్ తో తనకు విభేదాలు వచ్చాయన్న విషయంలో స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే...?

ఇక బయట ప్రచారం జరుగుతున్నట్టు ప్రభాస్ నన్ను దూరం పెట్టాడనటంలో ఎటువంటి నిజం లేదు అన్నారు శ్రీను. అది ఎంత మాత్రం వాస్తవం కాదు అన్నారు శ్రీను. బయట చాలా రకంగాలు అనుకుంటున్నారు. ఆయనతో గొడవపడి నేను విడిపోయాను అని. కాని ఆయనతో తగవులాడి.. విడిపోవాలని నాలాంటి వారు ఎందుకు అనుకుంటారు.. . ఇవన్నీ కూడా పనిలేని వాళ్లు సృష్టించే పుకార్లు. అప్పుడు .. ఇప్పుడు అనే కాదు ప్రభాస్ ఎప్పటికీ మారడు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ గానే ఉంటాము అన్నారు శ్రీను.

వైజాగ్ లో సత్యానంద్ గారి ఇనిస్టిట్యూట్ లో మేము ఇద్దరం యాక్టింగ్ నేర్చుకున్నాము. ఆ రోజుల నుంచి ప్రభాస్ నాకు మంచి ఫ్రెండ్. ఆయన ఎప్పటికైనా పెద్ద స్టార్ అవుతాడని నేను అప్పుడే అనుకున్నాను. అసలు ప్రభాస్ ఫస్ట్ మూవీ ఈశ్వర్ లో కూడా నేను నటించాల్సి ఉంది.. కాని వేరే సినిమాతో బిజీగా ఉండటం వలన, ఈశ్వర్ చేయలేకపోయాను. ఆ తరువాత ఆయనతో కలిసి చాలా సినిమాల్లో నటించాను. అన్నరు శ్రీను. అంతే కాదు ప్రభాస్ ఇప్పుడు ఎంతటి స్టార్ హీరో అయినప్పటికీ.. నాతో అప్పుడు ఉన్నట్టే చనువుగా ఉంటారు అన్నారు శ్రీను. స్టార్ డమ్ వచ్చినంత మాత్రాన మారిపోయే వ్యక్తి కాదు ప్రభాస్ అని అన్నారు శ్రీను.

మరింత సమాచారం తెలుసుకోండి: