లాక్ డౌన్ టైం నుండి ఈమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. జిమ్ లో ఈమె వర్కౌట్ల ఫోటోలు, బుల్లెట్ బండి నడుపుతున్న వీడియోలు, ఫోటోలు షేర్ చేసి హాట్ టాపిక్ అయ్యింది ఈ అమ్మడు. అప్పటి వరకు జనాలు చూసిన ప్రగతి వేరు.

సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తల్లి, అత్త, పిన్ని వంటి పాత్రలు చేస్తూ వచ్చిన ఈమెలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అంతా ఆశ్చర్యపోయారు. అయితే ప్రగతి మాత్రం ఇదే తన ఒరిజినల్ అని.. సినిమాల్లో చేసేది నటన అని తేల్చి చెప్పేసింది. లాక్ డౌన్ తర్వాత ప్రగతికి మరిన్ని మంచి పాత్రలు వస్తున్నాయి. ఇదే క్రమంలో పారితోషికం కూడా పెంచేసింది అనే వాదనా ఉంది. ఇక ప్రగతి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకం గా చెప్పనవసరం లేదు.

తన ఫ్యామిలీతో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోల ను కూడా ఈమె షేర్ చేస్తూ ఉంటుంది. మొన్నామధ్య తన కొడుకు ఫోటోలు షేర్ చేసిన ఈమె తన కూతురు గురించి కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఆమె తనకంటే ధైర్యవంతురా లు అని తెలియజేసింది ఈ అమ్మడు. నిన్న 'డాటర్స్ డే' కావడంతో ఆమె ఫోటోని షేర్ చేసి శుభాకాంక్షలు చెప్పింది ప్రగతి. దీంతో ఆమె కూతురు గీత ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈమె కూడా బోల్డ్ నెస్ లో తల్లిని మించిన కూతురిలా కనిపిస్తుంది. ఆమె ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి.ప్రగతి ఆంటీ అంటే తెలియని వారు అయితే వుండరు. ఆ మధ్య కాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది. టాలీవుడ్ లో బిజీ గా వున్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో ప్రగతి ఒకరు. ఈ మధ్యనే f3 సినిమాలో కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: